AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కత్తిపట్టిన కత్తిలా ఉన్నాడు.. పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫొటోపై ఫ్యాన్స్‌ రియాక్షన్స్‌

మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు పవర్‌ స్టార్‌. 'రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చాను' అని తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కత్తిపట్టిన కత్తిలా ఉన్నాడంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఈ ఫొటోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.

Pawan Kalyan: కత్తిపట్టిన కత్తిలా ఉన్నాడు.. పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫొటోపై ఫ్యాన్స్‌ రియాక్షన్స్‌
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Dec 09, 2022 | 8:43 PM

Share

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా నైపుణ్యం ఉన్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి మొదలుకుని తాజా హరిహర వీరమల్లు దాకా చాలా సినిమాల్లో ఎక్కడో ఒక చోట తన మార్షల్‌ ఆర్ట్స్‌ ట్యాలెంట్‌ను చూపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు పవర్‌ స్టార్‌. ‘రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చాను’ అని తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కత్తిపట్టిన కత్తిలా ఉన్నాడంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఈ ఫొటోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. కాగా ప‌వ‌న్ న‌టిస్తన్న తాజా చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్ చారిత్రాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ బందిపోటుగా కనిపిస్తారని ప్రచారం జరగుతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్‌ స్టిల్స్‌, ఫొటోలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

కాగా హరిహర వీరమల్లు సినిమాలో క‌థానుగుణంగా వీర‌మ‌ల్లు పాత్రకు మార్షల్ ఆర్ట్స్ విద్య అవ‌స‌ర‌మైనందున.. దీనికోసం ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నారు పవన్. ఈ సినిమా ద్వారా త‌న‌లోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని మరోసారి చూపించ‌బోతున్నారు పవన్‌. అందుకు తగ్గట్లే ట్రైన‌ర్‌తో క‌లిసి పవన్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది చిత్రబృందం. కాగా 17వ శతాబ్దంలో మొగ‌లుల కాలం నాటి కథతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్ పవన్‌ సరసన నటించనుంది. అలాగే బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, నర్గీస్‌ ఫక్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!