AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPL 2022: మూతి పళ్లు రాలిపోయి.. రక్తం ధారలా కారుతున్నా క్యాచ్‌ మిస్‌ చేయలేదు.. స్టార్‌ క్రికెటర్‌పై ప్రశంసలు

ఇక క్యాచ్‌ల విషయంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. బంతిని అందుకునే సమయంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కూడా చేరాల్సి వస్తుంది.

LPL 2022: మూతి పళ్లు రాలిపోయి.. రక్తం ధారలా కారుతున్నా క్యాచ్‌ మిస్‌ చేయలేదు.. స్టార్‌ క్రికెటర్‌పై ప్రశంసలు
Chamika Karunaratne
Basha Shek
|

Updated on: Dec 11, 2022 | 6:38 PM

Share

క్యాచెస్‌ విన్స్‌ మ్యాచెస్‌ అని క్రికెట్లో ఓ సామెత ఉంది. అయితే ఎంతో ఒత్తిడితో సాగే క్రికెట్‌ గేమ్‌లో క్యాచ్‌లు పట్టడం అంత తేలికేమీ కాదు. ఒక్కోసారి కష్టసాధ్యమైన క్యాచ్‌లు కూడా తేలికగా పడుతుంటారు ఆటగాళ్లు. అదే సమయంలో టెన్షన్‌కు గురై సులభమైన క్యాచ్‌లు కూడా నేల పాలు చేస్తుంటారు. ఇక క్యాచ్‌ల విషయంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. బంతిని అందుకునే సమయంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కూడా చేరాల్సి వస్తుంది. తాజాగా శ్రీలంక స్టార్‌ క్రికెటర్ చమిక కరుణరత్నే పరిస్థితి కూడా ఇలాంటిదే. ప్రస్తుతం అతను లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. బుధవారం (డిసెంబర్‌7) జరిగిన ఓ మ్యాచ్‌లో క్యాచ్‌ పట్టుకునే ప్రయత్నంలో అతని మూతి పళ్లు 4 విరిగిపోయాయి. రక్తం ధారలా కారింది. అయినా బంతిని విడచిపెట్టలేదు. చేతితో రక్తం కారకుండా ముఖాన్ని అడ్డుపెట్టుకున్నాడు. ఆ తర్వాత డగౌట్‌కు వెళ్లి ప్రథమ చికిత్స తీసుకున్నాడు. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సర్జరీ చేయాల్సిందే..

లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గాల్ గ్లాడియేటర్స్, కాండీ ఫాల్కన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గాలె గ్లాడియేటర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో నువిందు ఫెర్నాండో ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో సమీపంలో ఉన్న మరో ఇద్దరు ఫీల్డర్లు కూడా క్యాచ్‌ను పట్టుకునేందుకు వచ్చారు. అయితే వారిని చూసిన కరుణరత్నే దగ్గరకు రావద్దని వారించాడు. అయితే క్యాచ్‌ను పట్టుకుంటున్న సమయంలో దురదృష్టవశాత్తూ బంతి అతని మొహంపై బలంగా తాకింది. దీంతో పళ్లు ఊడిపోయి రక్తం ధారలా కారిపోయింది. అయితే పళ్లు పూర్తిగా విరిగిపోయాయని సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో కాండీ ఫాల్కన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గాలే గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్‌ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్‌ వసీమ్‌ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..