Suryakumar Yadav: పెళ్లి వేడుకల్లో సూర్య దంపతులు.. స్టైలిష్ దుస్తుల్లో మెరిసిపోయిన లవ్లీ కపుల్
Basha Shek |
Updated on: Dec 06, 2022 | 9:29 AM
విశ్రాంతి పేరుతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటికీ త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు సూర్యకుమార్ యాదవ్. దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రెండో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నుంచి ముంబైకి అందుబాటులో ఉంటాడు.
Dec 06, 2022 | 9:29 AM
త కొన్నినెలలుగా అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతోన్న టీమిండియా లేటెస్ట్ సెన్షేషన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ టూర్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.
1 / 5
దొరికిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ కోసం వెచ్చిస్తున్నాడు మిస్టర్ 360. తాజాగా తన భార్యతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు సూర్యకుమార్.
2 / 5
ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ డిజైనర్ కుర్తా, పైజామాతో స్టైలిష్‌గా మెరిసిపోయారు. ఇక అతని భార్య దేవిషా రెడ్ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ఇద్దరూ తమ తమ డ్రెస్సుల్లో డాషింగ్‌గా కనిపిస్తున్నారు.
3 / 5
విశ్రాంతి పేరుతో సూర్యకుమార్ యాదవ్‌ను బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ మైదానంలో దిగనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రెండో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నుంచి ముంబైకి అందుబాటులో ఉంటాడు.
4 / 5
సూర్యకుమార్ టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. . అతను ఇప్పుడు టీ20లో నంబర్ వన్ బ్యాటర్‌గా కూడా ఉన్నాడు.