Yashoda OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. యశోద ఓటీటీ డేట్‌ వచ్చేసిందోచ్‌.. ఆరోజు నుంచే సామ్‌ సినిమా స్ట్రీమింగ్‌

ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది.

Yashoda OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. యశోద ఓటీటీ డేట్‌ వచ్చేసిందోచ్‌.. ఆరోజు నుంచే సామ్‌ సినిమా స్ట్రీమింగ్‌
Yashoda Ott
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2022 | 12:54 PM

ఈ ఏడాది సమంత తెలుగులో నటించిన ఏకైక చిత్రం యశోద. సరోగసి, మెడికల్‌ మాఫియాల నేపథ్యంలో హరి, హరీశ్ సంయుక్తంగా ఈ థ్రిల్లర్‌ సినిమాను రూపొందించారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీనికి తోడు సినిమా విడుదలకు ముందే సామ్‌ మయోసైటిస్ బారిన పడడం, సెలైన్‌ బాటిల్‌తోనే డబ్బింగ్‌ చెప్పుకోవడం వంటి సంఘటనలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది సామ్‌ సినిమా. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో యశోద సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో డిసెంబర్‌ 9 నుంచి సామ్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ తెలిపింది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో యశోద సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది సదరు ఓటీటీ సంస్థ

కాగా యశోద సినిమా ఓటీటీ రిలీజుపై కొద్దిరోజులుగా సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. తమ ఆస్పత్రి పేరు ప్రతిష్ఠలు దెబ్బతినెలా సినిమాలో చూపించారని సదరు ఆస్పత్రి యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. చిత్రం ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో యశోద చిత్రబృందానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడీ వివాదం సమసిపోవడంతో యశోద ఓటీటీ రిలీజ్‌కు లైన్‌ క్లియర్ అయ్యింది. దీంతో ఈనెల 9 నుంచి ప్రసారం చేయనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ పేర్కొంది. ఈ సినిమాలో రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, దివ్య శ్రీపాద, కల్పికా గణేశ్‌, మధురిమ తదితరులు నటించారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మరి థియేటర్లలో యశోదను మిస్‌ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?