- Telugu News Photo Gallery Cricket photos Nicholas Pooran smashed 345 runs in T10 League most runs for Deccan Gladiators
Nicholas Pooran: ప్రపంచకప్‌లో తుస్సుమన్నా.. ఇక్కడ తారాజువ్వలా అదరగొట్టాడు.. 147 బంతుల్లో 345 పరుగులు బాదేశాడు
అబుదాబి టీ10 ఫైనల్లో డెక్కన్ గ్లాడియేటర్స్ 37 పరుగుల భారీ తేడాతో న్యూయార్క్ స్ట్రైకర్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 128 పరుగులు చేయగా, న్యూయార్క్ స్ట్రైకర్స్ 10 ఓవర్లలో 91 పరుగులు చేసింది. డెక్కన్ గ్లాడియేటర్స్ విజయంలో కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లోనే కాకుండా టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేశాడు.
Updated on: Dec 05, 2022 | 4:39 PM

ఫైనల్‌లో నికోలస్ పూరన్ 23 బంతుల్లో 40 పరుగులతో మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో డెక్కన్ గ్లాడియేటర్స్ కెప్టెన్ మొత్తం 345 పరుగులు సాధించాడు.

టీ10 లీగ్‌లో నికోలస్ పూరన్ 147 బంతుల్లో మొత్తం 345 పరుగులు చేశాడు. సగటు 49.28. స్ట్రైక్ రేట్ 234 కంటే ఎక్కువ.

నికోలస్ పూరన్ టీ10 లీగ్‌లో అత్యధికంగా 25 సిక్సర్లు కొట్టాడు.అంతేకాకుండా టోర్నీలోనే అత్యధికంగా 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

నికోలస్ పూరన్ తర్వాత, కాడ్మోర్ 289 పరుగులు చేశాడు. అతను 20 సిక్సర్లు కొట్టాడు. టిమ్ డేవిడ్ 16 సిక్సర్ల సాయంతో 221 పరుగులు చేశాడు.