Pawan Kalyan: సుజిత్ ఎంట్రీతో పవన్- హరీష్ శంకర్ మూవీ పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
ఇక మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత భీమ్లానాయక్ సినిమా చేశాడు. ఇక ఇప్పుడు హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా సినిమాలను లైనప్ చేస్తున్నాడు పవన్. ఇక మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత భీమ్లానాయక్ సినిమా చేశాడు. ఇక ఇప్పుడు హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొఘలాయుల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ బందిపోటుగా కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టైటిల్ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది.
ఈ మూవీ టైటిల్ ను అప్పుడెప్పుడో అనౌన్స్ చేసి రెడీగా ఉన్నాడు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా పై క్లారిటీ లేక ఫ్యాన్స్ తికమక పడుతున్నారు. టైటిల్ అయితే అనౌన్స్ చేశారు కానీ సినిమా ఉంటుందా ఉండదా అన్నదాని పై క్లారిటీ రాలేదు. ఈలోగా పవన్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేశాడు.
దాంతో హరీష్ శంకర్ సినిమా అటకెక్కినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి. సుజీత్ – డీవీవీ దానయ్య కాంబినేషన్‌లో పవన్ కల్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే హరీష్ శంకర్ సినిమా ఆగిపోలేదట. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని టాక్. సుజిత్ సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమాను కూడా ఒకే సమయంలో పూర్తి చేయాలని చూస్తున్నారట పవన్. త్వరలోనే హరీష్ శంకర్ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరుపుతారని అంటున్నారు. మరి ఏ ఏ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.