Mrunal Thakur: ట్రోలర్స్‌కు గట్టి కౌంటరిచ్చిన సీతారామం బ్యూటీ.. హీరోయిన్స్ అలాంటి పాత్రలు చేస్తే తప్పేంటీ ?..
ఈసినిమా భారీ విజయంతోపాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మృణాల్ అందం.. అభినయంకు దక్షిణాది ప్రేక్షకులు ముగ్దులయ్యారు
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో అచి తుచి అడుగులు వేస్తుంది. ఈ సినిమా భారీ విజయంతోపాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మృణాల్ అందం.. అభినయంకు దక్షిణాది ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దీంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో బిజీ కాబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మృణాల్ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ రాలేదు. ఎందుకంటే తన నెక్ట్స్ సినిమా కోసం రమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందట. తాజాగా ఈ ముద్దుగుమ్మను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చింది మృణాల్. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా…
సీతారామం సినిమాతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడు సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.దాంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ట్రోల్స్ బారిన పడింది. సోషల్ మీడియాలో మృణాల్ పై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. దానికి కారణం మృణాల్ సెలక్ట్ చేసుకున్న సినిమానే..
మృణాల్ బాలీవుడ్ లో పిప్పా అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పాత్ర నచ్చడంతో మృణాల్ ఓకే చెప్పిందట. అయితే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఇలా సిస్టర్ రోల్స్ చేయడం ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలా అయితే కెరీర్ ఖతం అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీని పై మృణాల్ స్పందిస్తూ.. ‘హీరోయిన్లు.. హీరోయిన్లుగానే నటించాలా.? సిస్టర్,భార్య, అమ్మ లాంటి క్యారెక్టర్స్ చేయకూడదా.? అని ప్రశ్నించింది. ఇలాంటి పద్దతిని మనం బ్రేక్ చేసినప్పుడే మనలోని సత్తా ఏంటో తెలుస్తుంది. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే.. ఓ గొప్ప పాత్ర మిస్ చేసుకున్నాననే బాధ ఉండోద్దు. అందుకే ఈ పాత్ర నచ్చడంతో సోదరి రోల్ అయిన ఒకే చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.