AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: డేట్‏కు వెళ్దాం అంటూ యంగ్ హీరోకు ప్రపోజల్.. ఫ్యాన్ ప్రశ్నకు అడివి శేష్ రియాక్షన్ అదుర్స్..

డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు.. శేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా అటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది.

Adivi Sesh: డేట్‏కు వెళ్దాం అంటూ యంగ్ హీరోకు ప్రపోజల్.. ఫ్యాన్ ప్రశ్నకు అడివి శేష్ రియాక్షన్ అదుర్స్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2022 | 7:19 AM

Share

మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన హిట్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. న్యాచురల్ నాని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు.. శేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా అటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. ఇక త్వరలోనే హిట్ 3 సైతం రాబోతుంది. ఇందులో నాని మెయిన్ రోల్ లో కనిపించనున్నారు. తాజాగా హిట్ 2 సక్సెస్ లో భాగంగా తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు అడివిశేష్..

ఆస్క్ మి ఎనీథింగ్ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు శేష్ తన స్టైల్లో సమధానాలు ఇచ్చారు. అయితే ఇందులో ఓ లేడీ ఫ్యాన్.. ఈ యంగ్ హీరోకు డేటింగ్ ప్రపోజల్ చేసింది. మనం ఎప్పుడు డేట్ కు వెళదాం అంటూ ట్విట్ చేయగా. సరదాగా రియాక్ట్ అయ్యారు శేష్. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా.. మనం ఇద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి చాట్ నెట్టింట వైరలవుతుంది..

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా ఇప్పటివరకు రూ. 28 .1 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో శేష్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరీ కథానాయికగా నటించగా.. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రలలో కనిపించారు. ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!