Naga Chaitanya: బావతో మరదలు ‘వంట’ ముచ్చట్లు.. నాగచైతన్యతో వెంకటేశ్ కూతురు ఆశ్రిత స్పెషల్ వీడియో..

తాజాగా తన యూట్యూబ్ ఛానల్‏లో తన బావ.. అక్కినేని నాగచైతన్య షోయు పేరుతో లాంచ్ చేసిన క్లౌడ్ కిచెన్‏ను ఇంట్రడ్యూస్ చేశారు ఆశ్రిత. అందులో అక్కడ తయారయ్యే ఆహారం గురించి చైతూ వివరిస్తూ.. ఆశ్రిత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిపించారు.

Naga Chaitanya: బావతో మరదలు 'వంట' ముచ్చట్లు.. నాగచైతన్యతో వెంకటేశ్ కూతురు ఆశ్రిత స్పెషల్ వీడియో..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2022 | 7:41 AM

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎక్కువగా మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వెంకీ డాటర్స్ మీడియా ముందుకు వచ్చింది చాలా తక్కువ. ఇదిలా ఉంటే.. వెంకీ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి ఫుడ్ వ్లాగర్. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే యూజర్ నేమ్‏తో సోషల్ మీడియాలో వంటలకు సంబంధించిన అనేక వీడియోస్… ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫాలోవర్లతో పంచుకుంటుంది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఎన్నో కొత్త వంటలను పరిచయం చేస్తుంటారు.. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‏లో తన బావ.. అక్కినేని నాగచైతన్య షోయు పేరుతో లాంచ్ చేసిన క్లౌడ్ కిచెన్‏ను ఇంట్రడ్యూస్ చేశారు ఆశ్రిత. అందులో అక్కడ తయారయ్యే ఆహారం గురించి చైతూ వివరిస్తూ.. ఆశ్రిత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిపించారు. అనంతరం ఆశ్రితకు చైతూ అక్కడి ఫుడ్ రుచి చూపించారు. ఆ టేస్ట్ కు ఫిదా అయిన ఆమె.. చెఫ్ లను అభినందించారు.

ఇక ఈ వీడియో ప్రారంభంలో నా బావ. చైతన్య అంటూ ఆహ్వానించడం పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. క్యూట్ .. మీ ఇద్దరిని ఇలా ఒకే వీడియో చూడడం ఆనందంగా ఉంది. మీ ఫ్యామిలీ నుంచి ఇలాంటి వీడియోస్ మరిన్ని ఆశిస్తున్నాం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చై తూ. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఎంటర్ ప్రెన్యూర్ గానూ రాణిస్తున్నారు. ఈమేరకు ఫుల్ లవర్స్ కు పాన్ ఏషియన్ టేస్టీ ఫుడ్ అందించేందుకు హైదరాబాద్ లో షోయు క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నారు.

ప్రస్తుతం చైతూ.. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.