Hit 2-Nani: హిట్ 2 సక్సెస్ మీట్‏లో న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు చేయడం లేదని..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయికుడిగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించారు శేష్. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

Hit 2-Nani: హిట్ 2 సక్సెస్ మీట్‏లో న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు చేయడం లేదని..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2022 | 8:12 AM

హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు త‌గ్గ‌ట్టే హిట్ సాధించారు డైరెక్టర్ శైలేష్ కొల‌ను. ఇప్పుడు ఆయ‌న హిట్ యూనివ‌ర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మ‌రో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయికుడిగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించారు శేష్. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ కమ్ హీరో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా పెట్టి అందులో కొత్త ఐడియాలతో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలనుకున్నానని అన్నారు.

తన బ్యానర్ లో రెగ్యులర్ సినిమాలు చేయకూడదనే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని.. డిఫరెంట్ సినిమాలను చేస్తే చూడరు కదా.. వర్కవుట్ అవుతుందా ! అని చాలా మంది భయపెట్టారు. కానీ నాకు ఎక్కడో బలమైన నమ్మకం . తెలుగు ప్రేక్షకులు డిఫరెంట సినిమాలను చూస్తారనే ధైర్యం ఉండింది. అది మరోసారి హిట్ 2తో ప్రూవ్ అయ్యింది అన్నారు. అలాగే.. నాని మాట్లాడుతూ.. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. వాల్ పోస్టర్ టీంకు థాంక్స్. పావని శ్రద్దగా, కోమలి వర్షగా చక్కగా నటించారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ వెంకట్ వంటి వారు దొరకడం మా అదృష్టం. సినిమాలోని వయలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్ చేసింది. శ్రీనాథ్ చక్కగా నటించారు. సుహాస్‌ అద్భుతంగా నటించాడు. యాక్టింగ్ అంటే కటౌట్ అవసరం లేదు. నాకు తెలిసిన నటీనటుల్లో సుహాస్ గొప్ప నటుడు. సురేష్‌ బొబ్బిలి గారి పాట బాగుంది. శ్రీలేఖ గారు ఇచ్చిన ఉరికే ఉరికే పాట నాకు ఎంతో ఇష్టం. మా సినిమా కోసం చాయ్ బిస్కెట్ టీం చాలా కష్టపడింది.

కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్‌లో శేష్ ఉంటాడు.. నేను కాపీ కొట్టి పాస్ అయ్యే బాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్‌ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా కంటిన్యూగా సక్సెస్‌లు కొడుతున్నాడు. వీరంతా చేసిన పనికి నాకు కూడా కంగ్రాట్స్ వస్తున్నాయి. వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త చిత్రాలు చేయాలని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ అంగీకరిస్తారా? అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మరోసారి నిరూపించారు. మా సినిమాకు సహకరించిన మీడియాకు థాంక్స్. అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్.. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మొబైల్‌లోని సిమ్‌ని ఇలా చేయండి!
మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మొబైల్‌లోని సిమ్‌ని ఇలా చేయండి!
ఉక్రెయిన్‌పై రష్యా భారీ ప్రతీకారం సిద్ధమవుతోందా..?
ఉక్రెయిన్‌పై రష్యా భారీ ప్రతీకారం సిద్ధమవుతోందా..?
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా