Unstoppable with NBK 2: ఆహాలో దూసుకుపోతోన్న బాలయ్య అన్‌స్టాపబుల్‌.. తాజా ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్‌

అన్‌స్టాపబుల్‌ 2 ఐదో ఎపిసోడ్‌కు లెజెండరీ దర్శక, నిర్మాతలు కె. రాఘవేంద్రరావు, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏ. కోదండరామిరెడ్డి హాజరయ్యారు. డిసెంబర్‌2 (శుక్రవారం) రాత్రి ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయ్యింది.

Unstoppable with NBK 2: ఆహాలో దూసుకుపోతోన్న బాలయ్య అన్‌స్టాపబుల్‌.. తాజా ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్‌
Unstoppable With Nbk 2
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2022 | 11:11 AM

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ ఛాట్‌షోకు ఓ రేంజ్‌లో ఆదరణ ఉంటోంది. రీల్‌, రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సీరియస్‌గా కనిపించే బాలయ్య ఈ టాక్‌షోలో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హాస్యచతురతతో అతిథులను ఆటపట్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఓటీటీ వ్యూస్‌పరంగా రికార్డులు కొల్లగొడుతోన్న అన్‌స్టాపబుల్‌ ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా మొదటి సీజన్‌ పూర్తి చేసుకుంది. ఇక రెండో సీజన్‌ కూడా అంతకుమించి అనేలా సాగుతోంది. ఈసీజన్‌లో సినిమా తారలతో పాటు మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు అన్‌స్టాపబుల్‌లో సందడి చేశారు. అలాగే సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడవి శేష్ లూ కూడా బాలయ్య షోకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు. కాగా అన్‌స్టాపబుల్‌ 2 ఐదో ఎపిసోడ్‌కు లెజెండరీ దర్శక, నిర్మాతలు కె. రాఘవేంద్రరావు, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏ. కోదండరామిరెడ్డి హాజరయ్యారు. డిసెంబర్‌2 (శుక్రవారం) రాత్రి ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయ్యింది.

కాగా తెలుగు సినిమాకు 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు. తమ సినిమా జీవితంలోని విశేషాలను, అనుభవాలను ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నారు రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, అరవింద్‌, కోదండరామిరెడ్డి. ఎప్పటిలాగే బాలయ్య తనదైన కామెడీ పంచులతో షోను మరింత రక్తికట్టించారు. ఇలా ఎంతో ఆహ్లాదకరంగా సాగిన నాలుగో ఎపిసోడ్‌ వ్యూస్‌ పరంగా రికార్డులు సృష్టించింది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను రాబట్టింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది ఆహా నిర్వాహకులు. కాగా అన్‌స్టాపబుల్‌ తర్వాతి ఎపిసోడ్‌లో ఎవరు రానున్నారనేది ఆసక్తికరంగామారింది. సీనియర్‌ హీరోయిన్లు జయసుధ, జయప్రదతో పాటు ప్రభాస్‌, గోపిచంద్‌ హాజరుకానున్నరని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు