AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ప్రేక్షకులకు ఫుల్ మస్తీ.. ఓటీటీలోకి రాబోతోన్న అదిరిపోయే సినిమాలివే..

ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో కలిపి 15కు పైగా చిత్రాలు థియేటర్లు/ఓటీటీల్లో విడుదల కానున్నాయి. వాటిల్లో గత నెల థియేటర్స్‌లో..

OTT Movies: ఈ వారం ప్రేక్షకులకు ఫుల్ మస్తీ.. ఓటీటీలోకి రాబోతోన్న అదిరిపోయే సినిమాలివే..
Ott Movies
Ravi Kiran
|

Updated on: Dec 05, 2022 | 6:13 PM

Share

ఓ వర్గం ప్రేక్షకులు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా పలు అదిరిపోయే చిత్రాలు, సూపర్ హిట్ వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో కలిపి 15కు పైగా చిత్రాలు థియేటర్లు/ఓటీటీల్లో విడుదల కానున్నాయి. వాటిల్లో గత నెల థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించిన మూడు చిత్రాలు ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఊర్వశివో రాక్షసివో:

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఓ ట్రెడిష‌న‌ల్ అబ్బాయి, మోడ్రన్‌ అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్ హిట్ దక్కించుకున్నాడు. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడని ఫ్యాన్స్ కోసం.. ‘ఊర్వశివో రాక్షసివో’ డిసెంబర్ 9వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు నెట్‌ఫ్లిక్స్.. ఇటు ఆహా ఓటీటీలో ఇది ఒకే డేట్ రిలీజ్ అవుతోంది. కాగా, ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌లో వెన్నెల కిశోర్‌, సునీల్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిల్లా కీలక పాత్రల్లో కనిపించారు. జీఏ 2 పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌:

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. వీడియో షూట్ కోసం వెళ్లిన ఇద్దరు వ్లాగర్లు.. ఓ నక్సల్ దళం చేతుల్లోకి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.? వారిద్దరూ ఎలా తప్పించుకున్నారు.? అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజయ్యి.. సందడి చేసింది. ఇక ఇప్పుడు సరిగ్గా నెల తర్వాత ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. ‘సోనీ లివ్‌’లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాచర్ల నియోజకవర్గం:

నితిన్‌ హీరోగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. మరో భామ కేథిరిన్‌ కీలక పాత్రలో కనిపించింది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఆగష్టు 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి జీ5లో ప్రసారం కానుంది.

Follow Us
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి..?
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి..?
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు