Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఫైమాకు అంత రెమ్యునరేషన్‌ ఇచ్చాడా? 13 వారాలకు గానూ ఎంత ముట్టజెప్పారంటే?

షో మొదటి నుంచే ఫిజికల్‌ గేమ్స్, టాస్కులు, ఫన్‌ గేమ్స్‌లో అదరగొడుతోందీ లేడీ కమెడియన్‌. ముఖ్యంగా షో టాప్‌ కంటెస్టెంట్‌గా పేరు వినిపిస్తోన్న స్టార్‌ సింగర్‌ రేవంత్‌ తో సై అంటే సై అని ఎదురుదాడికి దిగింది. ఆమె ఆటతీరును చూస్తుంటే కచ్చితంగా టాప్‌-5లో నిలుస్త్ఉందని భావించారు.

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఫైమాకు అంత రెమ్యునరేషన్‌ ఇచ్చాడా? 13 వారాలకు గానూ ఎంత ముట్టజెప్పారంటే?
Faima
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2022 | 1:51 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 6 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ ఎంటర్‌టైన్మెంట్‌ షోలో ఈసారి ఫైమా ఎలిమినేట్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా భావిస్తోన్న ఫైమా ఎలిమినేట్‌ కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే షో మొదటి నుంచే ఫిజికల్‌ గేమ్స్, టాస్కులు, ఫన్‌ గేమ్స్‌లో అదరగొడుతోందీ లేడీ కమెడియన్‌. ముఖ్యంగా షో టాప్‌ కంటెస్టెంట్‌గా పేరు వినిపిస్తోన్న స్టార్‌ సింగర్‌ రేవంత్‌ తో సై అంటే సై అని ఎదురుదాడికి దిగింది. ఆమె ఆటతీరును చూస్తుంటే కచ్చితంగా టాప్‌-5లో నిలుస్త్ఉందని భావించారు. అయితే అనూహ్యంగా హౌజ్‌ నుంచి బయటికి వచ్చింది. అయితే రోహిత్‌ను ఎడాపెడా తిట్టడం వల్లే ఫైమాకు నెగిటివిటీ వచ్చిందని, అందుకే ఎలిమినేట్‌ అయ్యిందని తెలుస్తోంది. కాగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. నాగార్జున ఫైమా చెయ్యి అందుకుని ముద్దుపెట్టాడు. దీంతో ఆమె రెండు చేతులతో మొహాన్ని మూసుకుని తెగ మురిసిపోయింది. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో 13 వారాల పాటు ఉంది ఫైమా. దీనికి గానూ ఆమె తీసుకున్న పారితోషకం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. లేడీ కమెడియన్‌గా మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఫైమాకు  బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

మళ్లీ జబర్దస్త్‌ కు వెళుతుందా?

కాగా ఫైమా గత సీజన్లోనే బిగ్‌బాస్‌ హౌస్‌ ఎంట్రీ కోసం ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం రాలేదు. అయితే ఈసారి ఛాన్స్‌ రావడంతో 13 వారాల వరకు హౌస్లో కొనసాగింది. ఇందుకు గాను ఆమెకు బాగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క వారానికి గానూ రూ. 25వేల నుంచి 30 వేలు అందినట్లు వినికిడి. ఇలా మొత్తం13 వారాలకు గానూ ఫైమా 3 లక్షల 25 వేల రూపాయలను తీసుకున్నట్లు సమాచారం. రియాలిటీషోలు, కామెడీషోల్లో పాల్గొన్నప్పుడు కడా ఫైమాకు ఈ రేంజ్‌లో పారితోషకం అందలేదు. ఆ విధంగా పోల్చుకుంటే బిగ్‌బాస్ అందించింది మంచి రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. ఈ విషయంపై ఫైమా కూడా హ్యాపీగానే ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరి బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫైమా మళ్లీ జబర్దస్త్‌ షోలో కనిపిస్తుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.