Jabardast Pavithraa: జబర్దస్త్‌ పవిత్ర ఇల్లు చూశారా? ఈ లేడీ కమెడియన్‌ లైఫ్‌లో ఇన్ని కన్నీటి కష్టాలున్నాయా?

బర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పాగల్‌ పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్‌టాక్‌ వీడియోలు చేసుకునే ఆమె జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంటోంది.

Jabardast Pavithraa: జబర్దస్త్‌ పవిత్ర ఇల్లు చూశారా? ఈ లేడీ కమెడియన్‌ లైఫ్‌లో ఇన్ని కన్నీటి కష్టాలున్నాయా?
Jabardast Pavithraa
Follow us
Basha Shek

|

Updated on: Dec 04, 2022 | 8:39 PM

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఎందరో నటీనటులను వెలుగులోకి తెచ్చింది. పురుషులతో పాటు అమ్మాయిలు కూడా ఈ బుల్లితెర షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు కూడా తెచ్చుకుంటున్నారు. అలా జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పాగల్‌ పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్‌టాక్‌ వీడియోలు చేసుకునే ఆమె జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంటోంది. బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌ లో కనిపిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అయితే కెరీర్‌ ఆరంభంలో కొన్ని సీరియల్స్‌లో నటించినా పవిత్రకు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే జబర్దస్త్ ఆమె జాతకాన్ని మార్చేసింది. అయితే బుల్లితెర కామెడీ షోల్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ అమ్మాయి లైఫ్‌లో ఎవరికీ కనిపించని కన్నీటి గాథలున్నాయి. కొన్నేళ్ల క్రితమే తండ్రి కన్నుమూశాడు. తల్లి ఊళ్లోనే ఉంటోంది. తనకు ఉన్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇల్లు వాస్తుకు లేకపోవడంతో ఇప్పుడు కొన్ని మరమ్మతులు చేయిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఇంటికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ ద్వారా షేర్ చేసిందీ జబర్దస్త్ కమెడియన్‌.

ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుని..

వీడియోలో ముందుగా పవిత్ర తన తల్లితో కలిసి తండ్రి చిత్ర పటానికి నివాళులర్పించింది. ఆ తర్వాత తమ ఇంట్లో జరుగుతున్న పనుల వివరాలను చెప్పుకొచ్చింది. తమ అభిరుచులు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటిలో మార్పులు చేయిస్తున్నట్లు తెలిపింది. ఈ పనులన్నీ పూర్తయితే తమ ఇల్లు కూడా మెరిసిపోతుందని మురిసిపోయింది పవిత్ర. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా వైరలవుతోంది. నెటిజన్లు పాజిటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. తండ్రి లేకపోయినా ఇంటి బాధ్యతలను భుజానకెత్తుకున్న పవిత్రపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుల్లితెరపై ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి జబర్దస్త్‌ పవిత్ర ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!