Watch Video: అరే బాసూ.. గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి? అక్కడకు కారును ఎలా తీసుకెళ్లావయ్యా?

Basha Shek

Basha Shek |

Updated on: Dec 03, 2022 | 10:25 PM

చాలామంది ప్రస్తుతం గూగుల్ మ్యాప్‌ ను ఫాలో అవుతున్నారు. ఎక్కడికి వెళ్లాలనుకున్నా దీనినే అనుసరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది సత్ఫలితాలనిస్తుంది. మనల్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. అయితే కొన్నిసార్లు Google Map  కూడా మనల్ని మోసం చేస్తుంది. 

Watch Video: అరే బాసూ..  గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి? అక్కడకు కారును ఎలా తీసుకెళ్లావయ్యా?
Car Accident

దారి తెలియనప్పుడు కారు నడపడం ఎంతో కష్టం. ఎందుకంటే ఒకసారి ఇరుకు దారుల్లోకి అడుగుపెట్టామంటే తిరిగి బయటపడడం కష్టసాధ్యంతో కూడుకున్న పని. ఇక చాలామంది ప్రస్తుతం గూగుల్ మ్యాప్‌ ను ఫాలో అవుతున్నారు. ఎక్కడికి వెళ్లాలనుకున్నా దీనినే అనుసరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది సత్ఫలితాలనిస్తుంది. మనల్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. అయితే కొన్నిసార్లు Google Map  కూడా మనల్ని మోసం చేస్తుంది.   ఫలితంగా మనం దారితప్పిపోతాం. అయితే ఇది అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఇలాంటిదే కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్ చూపిన రూట్‌ను అనుసరించడం వల్లే వాహనం ఎక్కడ కాకుండా ఇరుక్కుపోయిందని దీనిని చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోలో, కారు ఎత్తైన కొండపై ఇరుక్కుపోయింది. అందులో కొంత భాగం కొండ దిగువకు వేలాడుతుండడం గమనార్హం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. కొండపైకి వెళ్లే మార్గమే లేదు. అలాంటప్పుడు కారు అక్కడికి ఎలా చేరింది? గూగుల్ మ్యాప్ చూపిన మార్గాన్ని అనుసరించడం వల్ల ఇది నిజంగా జరిగిందా? ఇది ఖచ్చితంగా తెలియదు కానీ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Gulzar_sahab అనే ఐడితో షేర్‌ చేశారు. దీనికి ‘సోదరుడు గూగుల్ మ్యాప్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. అలాగే వందలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో, వీడియోను చూసిన ప్రజలు రకరకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు. ‘సోదరా గుడ్డిగా గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అయ్యావాఏంటి?’, ‘నేను కూడా ఒకసారి ఇలాగే అడవిలో చిక్కుకున్నాను ‘నేను కూడా ఒకసారి ట్రాప్ అయ్యాను. ఒక నదిలో. అక్కడికి చేరుకునే సరికి వంతెన లేదు’ అని తమ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu