Yashoda OTT: యశోద ఓటీటీ విడుదలకు లైన్‌ క్లియర్‌.. సామ్‌ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో యశోద సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 2 నుంచి సామ్‌ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

Yashoda OTT: యశోద ఓటీటీ విడుదలకు లైన్‌ క్లియర్‌.. సామ్‌ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Yashoda Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2022 | 4:39 PM

సమంత నటించిన మరో లేడి ఓరియంటెడ్‌ చిత్రం యశోద. సరోగసి నేపధ్యానికి మెడికల్‌ మాఫియాను జోడించి హరి, హరీష్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాలతో నవంబర్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లలో హిట్‌గా నిలిచిన యశోద సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో యశోద సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 2 నుంచి సమంత సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాగాయశోద సినిమాలో ఇవా హాస్పిటల్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతినెలా చూపించారని సదరు ఆస్పత్రి యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో తమ ఆస్పత్రి పేరు చూపించడం వలన తమ పరువు, ప్రతిష్ఠలు దెబ్బతింటాయని పేర్కొంది. చిత్రం ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడీ వివాదం సమసిపోయింది. ఇకపై యశోద సినిమాలో ఇవా పేరు ఇక కనపడదని మూవీ మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. దీంతో సామ్‌ సినిమా ఓటీటీ విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ సినిమాలో రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, దివ్య శ్రీపాద, కల్పికా గణేశ్‌, మధురిమ తదితరులు నటించారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మరి థియేటర్లలో యశోదను మిస్‌ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..