AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 2: సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హిట్ 2.. అప్పుడే ఓటీటీ పార్టర్నర్ లాక్.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..

నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

HIT 2: సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హిట్ 2.. అప్పుడే ఓటీటీ పార్టర్నర్ లాక్.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..
Hit 2 Ott
Rajitha Chanti
|

Updated on: Dec 02, 2022 | 4:30 PM

Share

హిట్ సిరీస్ పై ఇప్పటికే భారీగా క్రేజ్ ఏర్పడింది. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు త‌గ్గ‌ట్టే హిట్ సాధించారు శైలేష్ కొల‌ను. ఇప్పుడు ఆయ‌న హిట్ యూనివ‌ర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మ‌రో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. హిట్ కేస్ 1లో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించగా.. హిట్ 2లో అడివి శేష్ హీరోగా న‌టించారు. నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇందులో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి రేటుకు సేల్ అయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టీజర్.. ట్రైలర్ తో పాటు.. సినిమా ప్రమోషన్స్ తో క్యూరియాసిటిని పెంచేశారు మేకర్స్. ఇక ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ హిట్ యూనివర్స్ థార్డ్ పార్ట్ కూడా రాబోతుంది. ఇందులో నాని హీరోగా నటించబోతున్నట్లుగా హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. అడివి శేష్ సైతం నటించనున్నారట. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నారని టాక్.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?