Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable 2: మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ మల్టీస్టారర్.. మనసులోని మాట చెప్పేసిన అల్లు అరవింద్..

తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో టాలీవుడ్ అగ్రనిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య.. చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని

Unstoppable 2: మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ మల్టీస్టారర్.. మనసులోని మాట చెప్పేసిన అల్లు అరవింద్..
Balakrishna, Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 01, 2022 | 4:43 PM

ఇన్నాళ్లు మాస్ హీరోగా యాక్షన్ చిత్రాలతో అలరించిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు యాంకర్‏గానూ అదరగొడుతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సీజన్ 2లోనూ తనదైన స్టైల్లో ఆడియన్స్‏ను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సీజన్ 2 నుంచి ఐదో ఎపిసోడ్ రాబోతుంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆహాలో ఎపిసోడ్ 5 స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో టాలీవుడ్ అగ్రనిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య.. చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటలను బయటపెట్టారు అల్లు అరవింద్.

సెలబ్రేటింగ్ 90 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ స్టేజ్ పూర్తిగా నందమూరి తారక రామారావు కటౌట్స్ చూపిస్తూ ప్రోమో స్టార్ట్ చేశారు. “తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టిన వాళ్లు.. సినిమానే ప్రపంచంగా పెరిగిన వాళ్లు.. ఇవ్వాళ మన నిర్మాతలు”.. అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబులను ఇన్వైట్ చేశారు బాలయ్య. వారిద్దరిని చూడగానే.. భలే దొంగ, మంచి దొంగ.. ఇలాంటి దొంగ సినిమాలు గుర్తువస్తున్నాయని బాలయ్య అనగానే.. కథానాయకుడు వంటి మంచి సినిమాలు చెప్పాలన్నారు సురేష్ బాబు.. అనంతరం.. “సురేష్ గారితో నా అనుబంధం మీకు తెలిసే ఉంటుంది. ఇక పాయింట్ ఏంటంటే.. మనిద్దరి కాంబినేషనే బ్యాలెన్స్” అంటూ అల్లు అరవింద్ ను అడిగారు.

ఇందుకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. “మీరు.. చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నాను అని అనగానే.. అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందన్నారు” బాలయ్య. ఇక అల్లు అరవింద్ తన మనసులోని మాట చెప్పడంతో సెట్ లో ప్రేక్షకులు కేకలతో హోరెత్తించారు. ఇటీవల నందమూరి ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో వచ్చిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్ పై కలిసి చూడడంతో మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఇప్పుడు చిరంజీవి.. బాలయ్య కాంబోలో సినిమా అంటే థియేటర్లలు దద్దరిల్లాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.