Tollywood: ఓటీటీ- థియేటర్స్‌లో కలిపి ఈ ఏడాదికి సాలిడ్ సెండాఫ్ ఇవ్వడానికి రెడీ అయిన సినిమాలు ఇవే..
ఈ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను అందుకున్నాయి..డిసెంబర్ లో సినిమాలు రిలీజ్ చేస్తే సంక్రాంతి వరకు పోటీ ఉండదు.
2022కి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది.. మరో నెల రోజుల్లో కొత్తసంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం.. ఇక ఈ చివరి నెలలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రానున్న సినిమాలు ఏవో తెలుసా.. ప్రతి ఏడాది సంక్రాంతికే కాదు.. క్రిస్మస్ కు కూడా సినిమాల సందడి చేయనున్నాయి. ఈ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను అందుకున్నాయి..డిసెంబర్ లో సినిమాలు రిలీజ్ చేస్తే సంక్రాంతి వరకు పోటీ ఉండదు. పండగకు ఎలాగో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతాయి. కాబట్టి ఈ లోగానే సినిమాలను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు కొందరు హీరోలు. మరి డిసెంబర్ లో రానున్న సినిమాలు ఏంటో చూద్దాం.. ఈ చివరి నెలలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అడవి శేష్ నటించిన హిట్ 2 గురించే.. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.
హిట్ 2 సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అడవి శేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే హిట్ 2తో తోపాటు డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమా పంచతంత్రం. కలర్ స్వాతి, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు.
అలాగే క్రేజీ హీరో విజయ్ దేవర కొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 18పేజెస్ సినిమా కూడా ఇదే నెలలో రానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమాల్లో ఈ ఏడాదికి సాలిడ్ సక్సెస్ తో సెండాఫ్ ఇచ్చేది ఎవరో చూడాలి.
ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికొస్తే.. ఫ్రెడ్డీ కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ మూవీ డిసెంబర్ 2న డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఇండియన్ లాక్ డౌన్.. జీ5 లో డిసెంబర్2 స్ట్రీమింగ్ కానుంది. అదేవిధంగా.. అలాగే నెట్ ఫ్లిక్స్ లో అమితాబ్ఎం రష్మిక నటించిన గుడ్ బై కూడా అదే రోజు స్ట్రీమింగ్ కానుంది. అలాగే తాప్సి నటించిన బ్లర్ అనే సినిమా కూడా ఇదే నెలలో రిలీజ్ అవ్వనుంది. డిసెంబర్ 9న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే గోవిందా మేరా నామ్ సినిమా కూడా డిసెంబర్ 16న డిస్ని హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.