AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త కారు కొనాలా? సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? మీ డౌట్‌ క్లియర్‌ చేసే వార్త!

కారు కొనుగోలులో కొత్తదా, వాడినదా అనే సందేహం సహజం. కొత్త కారు తాజా టెక్నాలజీ, వారంటీ ప్రయోజనాలు అందిస్తుంది కానీ విలువ త్వరగా తగ్గుతుంది. సెకండ్ హ్యాండ్ కారు తక్కువ బడ్జెట్‌లో లభిస్తుంది, విలువ తగ్గుదల ప్రభావం తక్కువ. అయితే ప్రమాద రికార్డులు, ఇంజిన్ పరిస్థితి వంటివి పరిశీలించాలి.

కొత్త కారు కొనాలా? సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? మీ డౌట్‌ క్లియర్‌ చేసే వార్త!
New Car Vs Used Car
SN Pasha
|

Updated on: Mar 17, 2026 | 9:00 AM

Share

ఇండియలో కారు కొనుగోలు చేయాలనుకునే చాలా మంది ముందుగా ఎదుర్కొనే ప్రధాన సందేహం కొత్త కారు కొనాలా లేదా సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? పెరుగుతున్న వాహన ధరలు, రుణ వడ్డీ రేట్లు, నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత కీలకంగా మారుతోంది. కొత్త కారు కొనుగోలు చేస్తే తాజా సాంకేతికత, మెరుగైన భద్రతా ఫీచర్లు మరియు తయారీదారు వారంటీ లభిస్తాయి. సాధారణంగా కొత్త వాహనాలకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వారంటీ ఉండటం వల్ల ప్రారంభ సంవత్సరాల్లో పెద్దగా మరమ్మతు ఖర్చులు ఉండవు. అదనంగా, ఇంధన సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు కూడా కొత్త మోడళ్లలో మెరుగ్గా ఉంటాయి.

అయితే కొత్త కారు కొనుగోలు చేసిన వెంటనే దాని విలువ తగ్గడం ప్రారంభమవుతుంది. మొదటి రెండు నుండి మూడు సంవత్సరాల్లోనే వాహనం విలువ గణనీయంగా పడిపోతుందని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం తక్కువ బడ్జెట్ ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదే మోడల్ కారును కొత్త ధర కంటే చాలా తక్కువకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. డిప్రెషియేషన్ ఇప్పటికే జరిగి ఉండటం వల్ల విలువ తగ్గుదల ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. అయితే సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. వాహనం ప్రమాదాల్లో పాల్గొన్నదా, ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది, సర్వీస్ రికార్డులు ఉన్నాయా వంటి అంశాలను సరిచూడాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం కొనుగోలుదారుడి బడ్జెట్, వాహనం ఉపయోగం, నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువకాలం ఉపయోగించాలనుకుంటే కొత్త కారు అనుకూలం. తక్కువ బడ్జెట్‌లో వాహనం అవసరమైతే సెకండ్ హ్యాండ్ కారు మంచి ఎంపిక కావచ్చు. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఉత్కంఠగా మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. రాజస్థాన్ ఆశలు గల్లంతు
ఉత్కంఠగా మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. రాజస్థాన్ ఆశలు గల్లంతు
పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే..
పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే..
నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్..
నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు..
ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా..
ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా..
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..