Vijayashanthi: మగవాళ్లను కూడా దెయ్యాలుగా చూపించవచ్చేమో కదా.. యువతి ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన రాములమ్మ..
తాజాగా విజయశాంతికి ఓ అభిమాని నుంచి వింత ప్రశ్న ఎదురైంది. ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రాములమ్మను అభిమాని అడిగిన ప్రశ్నను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

విజయశాంతి.. తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున వంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో రాములమ్మగా ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత సినీ పరిశ్రమకు పూర్తిగా దూరంగా ఉన్న విజయశాంతి.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ కీలకపాత్రలో నటించారు. తాజాగా విజయశాంతికి ఓ అభిమాని నుంచి వింత ప్రశ్న ఎదురైంది. ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రాములమ్మను అభిమాని అడిగిన ప్రశ్నను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
” అక్కా.. సినిమాల్లో దెయ్యాలన్నీ మహిళలే ఎందుకు ? మనం అంత చెడ్డవాళ్లమా ? అని ఓ మహిళా అభిమాని అడిగారు. రాక్షసులందరూ పురాణాల్లో ఎక్కువగా మగవాళ్లే ఎందుకు అని మనం కూడా అనవచ్చు. అలాగే.. మగవాళ్లు తీసే సినిమాల్లో మహిళలను దెయ్యాలుగా చూపించే పని చేస్తున్నారు. మహిళలు తీసే సినిమాల్లో మగవారిని కూడా అలా దెయ్యాలుగా చూపించవచ్చునేమో.. మరి” అంటూ ‘ఎవ్వరినీ బాధపెట్టడానికి కాదు, ఆ మహిళా అభిమానికి నవ్వుతూ ఇచ్చిన సమాధానం మాత్రమే’… అని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు విజయశాంతి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన విజయశాంతి.. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెండితెరపై సందడి చేశారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ.. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.