AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: పుష్ఫ సినిమా చూశా కానీ అల్లు అర్జున్ ఎవరో తెలీదు.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

ప్రస్తుతం చిత్రయూనిట్‏తో పాటు.. బన్నీ కూడా రష్యాలో పుష్ప ప్రీమియర్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Allu Arjun: పుష్ఫ సినిమా చూశా కానీ అల్లు అర్జున్ ఎవరో తెలీదు..  సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2022 | 5:50 PM

Share

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనను అభిమానులు ముద్దుగా బన్నీ అని పిలిచుకుంటారు. ప్రస్తుతం బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పుష్పలో బన్నీ నటనకు ప్రతి సినీ ప్రేమికుడు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సెన్సెషనల్ క్రియేట్ చేసిన పుష్ప చిత్రాన్ని త్వరలోనే రష్యాలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్‏తో పాటు.. బన్నీ కూడా రష్యాలో పుష్ప ప్రీమియర్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పుష్ప సినిమా చూశాను.. కానీ బన్నీ ఎవరో తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న అలీతో సరదాగా షోకు అతిథిగా అలనాటి హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి విచ్చేశారు. హోస్ట్ అలీ ఆమెతో అప్పటి విషయాల గురించి మాట్లాడారు. సీనియర్ ఎన్టీఆర్ ఆమెను కోడలా అని ముద్దుగా పిలిచేవారట కదా అని గుర్తుచేయగా.. నిజమే అన్నారు. అలాగే గుండమ్మ కథలో తనతో ఒక్కపాటైనా చేయించాలని కేవలం రెండు రోజుల్లోనే మ్యూజిక్ తోనే సాంగ్ పెట్టించారని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఈ జనరేషన్ చేసిన సినిమాలు ఏమైనా చూశారా అని అడగ్గా.. పుష్ప సినిమా చూశానని చెప్పుకొచ్చింది. అయితే అందులో నటించిన హీరో ఎవరో తెలుసా అని అడగ్గా.. తెలియదు అని చెప్పింది. దీంతో అలీ మాట్లాడుతూ.. అతడు అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పాడు. ఈ మధ్య యంగ్ హీరోల గురించి అడుగుతుంటే అందరూ ఎన్టీఆర్ మనవడు.. రామానాయుడు మనవడు అని చెప్తున్నారంటూ చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతుంది.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు