Dhanush: తెలుగులో మరో ప్రాజెక్ట్ చేస్తోన్న ధనుష్.. ఎట్టకేలకు శేఖర్ కమ్ములతో సినిమా స్టార్ట్ చేసిన కోలీవుడ్ స్టార్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Nov 28, 2022 | 3:55 PM

కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.. తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, పాత బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన

Dhanush: తెలుగులో మరో ప్రాజెక్ట్ చేస్తోన్న ధనుష్.. ఎట్టకేలకు శేఖర్ కమ్ములతో సినిమా స్టార్ట్ చేసిన కోలీవుడ్ స్టార్..
Dhanush

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్‏కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ టూ నార్త్ ఆయనకు భారీగా అభిమానులున్నారు . ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటులలో ఒకరు ధనుష్. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.. తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, పాత బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ లో రూపొందుతున్న క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుని, విడుదల కానుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఇవి కూడా చదవండి

సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ప్రాజెక్ట్ కి సంబధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu