AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: కృతి సనన్ మనసులో ఉన్న హీరో అతనే.. హీరోయిన్ రిలేషన్‏షిప్ పై వరుణ్ ధావన్ ఆసక్తికర కామెంట్స్..

ప్రభాస్ అంటే తనకు ఇష్టమని.. ఆయన్ను అభిమానిస్తున్నానని.. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే అని పలు సందర్భాల్లో కృతి చెప్పడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్..

Kriti Sanon: కృతి సనన్ మనసులో ఉన్న హీరో అతనే.. హీరోయిన్ రిలేషన్‏షిప్ పై వరుణ్ ధావన్ ఆసక్తికర కామెంట్స్..
Kriti Saon, Varun Dhawan
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2022 | 3:54 PM

Share

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియదు కానీ.. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని.. ఆయన్ను అభిమానిస్తున్నానని.. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే అని పలు సందర్భాల్లో కృతి చెప్పడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. కృతి రిలేషన్ షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఓ స్టార్ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని అన్నారు. తాను, కృతి కలిసి నటించిన భేదియా చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆయన.. బీటౌన్ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన.. కృతి సనన్ పేరు నా జాబితాలో లేదు. ఎందుకంటే ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి చిత్రీకరణలో ఉన్నాడు. అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం డార్లింగ్ పేరును ఇంతలా వాడుతున్నారేంటీ ? అంటూ మండిపడుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్, కృతి కలిసి పనిచేశారు. రమాయణం ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. కృతి సీతగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ మారుతి.. దర్శకుడు సందీప్ వంగాతో మరో రెండు ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంది.

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు