Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irene Cara: మూగబోయిన గాత్రం.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఫేమస్ సింగర్ ఐరీన్ మృతి..

ఐరీన్ మరణంతోనే ఆమె కుటుంబంతో దుఃఖంలో మునిగిపోయిందంటూ ట్వీట్ చేశాడు. ఐరీన్ మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

Irene Cara: మూగబోయిన గాత్రం.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఫేమస్ సింగర్ ఐరీన్ మృతి..
Irene Cara
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2022 | 4:20 PM

హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్కార్ అవార్డ్ విజేత సింగర్.. నటి ఐరీన్ కారా కన్నుమూశారు. ఫేమ్, ఫ్లాష్ డ్యాన్స్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందారు ఐరీన్. 63 ఏళ్ల ఐరీన్ ఫ్లోరీడాలోని తన నివాసంలో మృతి చెందినట్లు.. ఆమె ప్రచారకర్త జుడిత్ ఎ.మూస్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఐరీన్ మరణంతోనే ఆమె కుటుంబంతో దుఃఖంలో మునిగిపోయిందంటూ ట్వీట్ చేశాడు. ఐరీన్ మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆమె మృతితో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐరీన్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఫేమ్ టైటిల్ సాంగ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఐరీన్. ఇదే పాటలో ఆమె నటించారు కూడా. ఈ ట్రాక్ ఉత్తమ ఒరిజినల్ కేటగిరిలో ఆమెకు ఆస్కార్ అవార్డ్ అందుకుంది. తన కెరీర్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించారు. బ్రేక్‌డాన్స్, అవుట్ హియర్ ఆన్ మై ఓన్, ఫేమ్, ఫ్లాష్‌డ్యాన్స్ … వాట్ ఎ ఫీలింగ్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 80వ దశకం ప్రారంభంలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించారు.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్‌లో జన్మించిన కారా బ్రాడ్‌వేలో కెరీర్ ప్రారంభించింది. ముందు “ది మీ నోబడీ నోస్” అనే సంగీత కార్యక్రమం ద్వారా 300 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె 1990ల మధ్యలో మేరీ మాగ్డలీన్‌గా “జీసస్ క్రైస్ట్ సూపర్‌స్టార్” సంగీతాన్ని సందర్శించింది. ఆమె పాటలతో 2012-14లో “ఫ్లాష్‌డ్యాన్స్” అనే సాంగ్ రిలీజ్ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.