Theatre/OTT Movies: ఆకట్టుకునే సినిమాలు, సిరీస్‌లతో మూవీ లవర్స్‌కు పండగే.. ఈవారం థియేటర్లు/ ఓటీటీ రిలీజులివే

కరోనా కారణంగా మన జీవితాల్లోకి వచ్చిన ఓటీటీలు కూడా మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నాయి. అందుకే ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్‌ల రిలీజుల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Theatre/OTT Movies: ఆకట్టుకునే సినిమాలు, సిరీస్‌లతో మూవీ లవర్స్‌కు పండగే.. ఈవారం థియేటర్లు/ ఓటీటీ రిలీజులివే
Theatre, Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2022 | 12:13 PM

2022 సంవత్సరం ముగియడానికి మరో నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికే ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టి ప్రేక్షకులకు కావల్సినంతా వినోదాన్ని అందించాయి. ఇక కరోనా కారణంగా మన జీవితాల్లోకి వచ్చిన ఓటీటీలు కూడా మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నాయి. అందుకే ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్‌ల రిలీజుల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

హిట్‌ 2

Hit 2

Hit 2

మేజర్‌ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ తర్వాత అడవి శేష్‌ నటిస్తోన్న చిత్రం హిట్‌..ది సెకెండ కేస్‌. గతంలో వచ్చిన హిట్‌కు ఇది సీక్వెలే అయినా ఈసారి మరింత ఆసక్తికరంగా సినిమాను రూపొందిచినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మీనాక్షి, రావు రమేష్‌, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ సినిమాకు నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ డిసెంబర్‌ 2న విడుదల కానుంది.

మట్టికుస్తీ

Matti Kusthi

Matti Kusthi

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ నటిస్తోన్న తాజా చిత్ర మట్టి కుస్తీ. మాస్‌ మహరాజా నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. చెల్ల అయ్యావు దర్శకత్వం వహించిన ఈసినిమా డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

జల్లికట్టు బసవ

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జల్లికట్టు బసవ. తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. జల్లికట్టు నేపథ్యంలో ఆర్. పన్నీర్‌ సెల్వన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. డిసెంబర్‌ 2 న ఈ చిత్రం థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.

వీటితో పాటు బాలకృష్ణ కోల, ప్రభాకర్‌, రావు రమేశ్‌, తాగుబోతు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరెక్కిన ఇంతకీ అతనెవరు? సినిమా డిసెంబర్‌ 2న రిలీజ్‌ కానుంది.

ఓటీటీ సినిమాలు /వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌)- నవంబరు 29
  • మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ)- నవంబరు 30
  • ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ)- డిసెంబరు 1
  • జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్)- డిసెంబరు 1
Love Today Movie

Love Today Movie

  • లవ్‌టుడే- డిసెంబరు 2
  • గుడ్‌బై (హిందీ)- డిసెంబరు 2

డిస్నీ+హాట్‌స్టార్‌

  • విల్లో (వెబ్‌సిరీస్‌)- నవంబరు 30
  • రిపీట్‌ (తెలుగు)- డిసెంబరు 1
  • డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌- డిసెంబరు 2
  • ఫ్రెడ్డీ (హిందీ)-డిసెంబరు 2
  • మాన్‌స్టర్‌ (మలయాళం)- డిసెంబరు 2

జీ5

  • ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌)- డిసెంబరు 2
  • మాన్‌సూన్‌ రాగా (బాలీవుడ్‌)- డిసెంబరు 2

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2)- డిసెంబరు 2
  • కాంతార (తుళు)- డిసెంబరు 2
  • వదంతి (వెబ్‌సిరీస్‌)- డిసెంబరు 2

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..