Janhvi Kapoor: హైదరాబాద్‌తో నాకెన్నో అందమైన జ్ఞాపకాలున్నాయి.. అప్పుడే తెలుగు సినిమా చేస్తా: జాన్వీ

నిత్యం సినిమాలతో బిజీగా ఉండే జాన్వీ ఇటీవల ఓ ఫ్యాషన్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భాగ్యనగరంతో తనకున్న అనుబంధాన్ని అందరితో పంచుకుంది.

Janhvi Kapoor: హైదరాబాద్‌తో నాకెన్నో అందమైన జ్ఞాపకాలున్నాయి.. అప్పుడే తెలుగు సినిమా చేస్తా: జాన్వీ
Janhvi Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2022 | 11:34 AM

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. అందం, అభినయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకే ఓ వైపు గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే మరోవైపు కార్గిల్ గర్ల్‌, మిలీ వంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తోంది. సినిమాలే కాదు సోషల్‌ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ యాక్టివ్‌గా ఉంటుంది. నెట్టింట ఆమెకు బోలెడు ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా ఈ సొగసరి షేర్‌ చేసే గ్లామరస్‌,ఫ్యాషనబుల్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంద. కాగా నిత్యం సినిమాలతో బిజీగా ఉండే జాన్వీ ఇటీవల ఓ ఫ్యాషన్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భాగ్యనగరంతో తనకున్న అనుబంధాన్ని అందరితో పంచుకుంది.

‘హైదరాబాద్ నగరంతో నాకెన్నో అందమైన జ్ఞాపకాలున్నాయి. చిన్నప్పుడు మా నాన్న బోనీకపూర్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు నా మీద ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ షూటింగ్ అయ్యాక నేరుగా తిరుపతికి వెళ్లడం నాకు అలవాటు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలంటే నాకెంతో ఇష్టం. చాలా కాలం తర్వాత నా మనసుకు దగ్గరైన నగరానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం సౌత్ సినిమాల వైపు చూస్తోంది. నా వారసత్వ మూలాలు కూడా దక్షిణాదిలో ఉన్నాయి. అందుకే ఎక్కడ, ఎప్పుడు సినిమాలు చేసినా దక్షిణాది అమ్మాయినే అని గర్వంగా చెప్పుకుంటాను. ఇక తెలుగులో అమ్మ గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది. ఇక్కడ ఆమె ఆరాధ్యదైవం. నాక్కూడా టాలీవుడ్‌లో కూడా ఓ మంచి ప్రాజెక్ట్‌ చేయాలని ఉంది. ఇక్కడ మంచి కథలు, దర్శకుల కొరత లేదు. ఎప్పుడనేది చెప్పలేం కానీ కచ్చితంగా తెలుగులో సినిమా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది జాన్వీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ