Nayanthara: పని మనిషికి లక్షల సాయం చేసిన గొప్ప మనసు ఆమెది.. నయన్‌పై విఘ్నేశ్‌ తల్లి ప్రశంసల వర్షం

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, ఆమె అత్తయ్య మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల నయన్‌ గురించి ఆమె అత్త మీనాకుమారి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం

Nayanthara: పని మనిషికి లక్షల సాయం చేసిన గొప్ప మనసు ఆమెది.. నయన్‌పై విఘ్నేశ్‌ తల్లి ప్రశంసల వర్షం
Nayanthara
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2022 | 12:03 PM

కొందరిళ్లలో అత్తా, కోడళ్లు ఉప్పు, నిప్పులా ఉంటారు. ఒకరికొకరంటే అస్సలు పడుతుండదు. అందుకే అత్తలేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అన్న సామెత కూడా ప్రచారంలో ఉంది. అయితే సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, ఆమె అత్తమ్మ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల నయన్‌ గురించి ఆమె అత్త మీనాకుమారి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.. ‘నా కొడుకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌. నా కోడలు స్టార్‌ హీరోయిన్‌. నా కొడుకు, కోడలు ఇద్దరూ కష్టపడి పనిచేయడమే కాదు. కష్టపడి పనిచేసేవాళ్లను కూడా అంతే గౌరవిస్తారు. నయనతార ఇంట్లో మొత్తం ఎనిమిది మంది పనివాళ్లు ఉన్నారు. అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉందని తెలిసి వెంటనే వాళ్లకు ఆ డబ్బులిచ్చి సాయం చేసింది. అంత గొప్ప మనసు నా కోడలిది. తన దగ్గర పనిచేసేవాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంట్లో పనిచేసేవాళ్లకు అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సాయం చేసేందుకు ఎంతో దయార్ధ్ర హృదయం ఉండాలి. పది మంది చేసే పనిని కూడా తను ఒక్కటే చేయగలదు’ అని ప్రశంసలతో ముంచెత్తింది నయన్‌ అత్తమ్మ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.

సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న నయనతార కోలీవుడ్ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి పెళ్లి పీటలెక్కింది. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న వీరు ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఈ వ్యవహారంపై పలు వివాదాలు తలెత్తాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ సినిమాలో చివరిగా కనిపించింది నయన్‌. ప్రస్తుతం ఆమె చేతిలో కనెక్ట్‌, గోల్డ్‌, జవాన్‌, ఇరైవన్‌ వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. దీంతో పాటు లేడీ సూపర్‌ స్టార్‌ 75, ఎన్‌టీ81 (వర్కింగ్ టైటిల్స్‌)కు సినిమాలకు కూడా సైన్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ