టోర్నీ ప్రారంభం నుంచి ఆడుతున్నా ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏటా భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత తుస్సుమనిపించడం ఆ జట్టుకు అలవాటే అయిపోయింది. కెప్టెన్లను మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. కనీసం వచ్చే సీజన్‌లోనైనా ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలని ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ ఆశిస్తోంది. అయితే ఈసారి ఆ జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. ఒకవైపు అన్ని జట్లు మినీ వేలానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఆర్‌సీబీ అంటి పెట్టుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం ఐపీఎల్ 2023 ప్రారంభమ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం ఆ జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం గ్లెన్ మాక్స్‌వెల్ కాలికి తీవ్ర గాయమైంది. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో మ్యాక్సీ కాలి ఎముక విరిగిపోయింది. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు.
కాగా గాయం తీవ్రత బాగా ఉందని, అతను మరో మూడు నెలల పాటు మైదానంలోకి అడుగుపెట్టలేడని తెలుస్తోంది. అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తిగా ఇంటికే పరిమితం కానున్నాడు గ్లెన్. అయితే మార్చిలో కూడా అనుమానమేనని సమాచారం. దీని గురించి గ్లెన్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఆస్ట్రేలియా టీమ్ సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనన్నాడు. తద్వారా మార్చిలో ఐపీఎల్ నిర్వహిస్తే కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతానని చెప్పకనే చెప్పాడు.
తన గాయం ఎప్పుడు పూర్తిగా నయమవుతుందన్న విషయంపై కూడా మాట దాట వేశాడు మ్యాక్సీ. ఒకవేళ మార్చి నెలలో మ్యాక్సీ ట్రైనింగ్ స్టార్ట్ చేయకపోతే.. ఐపీఎల్ ప్రథమార్థం నుంచి తప్పుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. కాగా ఆర్‌సీబీ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఒకవేళ అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుంటే.. ఆర్సీబీకి ఇది పెద్ద ఎదురుదెబ్బేనని భావించవచ్చు.
Believe in the core!
12th Man Army, here are our 𝗿𝗲𝘁𝗮𝗶𝗻𝗲𝗱 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 who will be a part of RCB’s #Classof2023!#PlayBold #WeAreChallengers pic.twitter.com/aQCnh2K66E
— Royal Challengers Bangalore (@RCBTweets) November 15, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..