Rashmika Mandanna: శ్రీవల్లికి సొంతింటి కష్టాలు.. కెరీర్‌ రిస్క్‌లో పడినట్లేనా? ఫ్యాన్స్‌ ఏం కావాలి?

రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి..ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే. ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్లైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది.

Rashmika Mandanna: శ్రీవల్లికి సొంతింటి కష్టాలు.. కెరీర్‌ రిస్క్‌లో పడినట్లేనా? ఫ్యాన్స్‌ ఏం కావాలి?
Rashmika Vs Rishab
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2022 | 12:58 PM

హీరోయిన్ రష్మిక మందన్నా..! డైరెక్టర్‌ రిషబ్‌శెట్టి..! ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్‌లోనే అత్యుత్తమస్థాయిలో ఉన్నారు.! సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు..! పుష్ప హిట్‌తో పాన్‌ ఇండియా లెవల్లో స్టార్‌డమ్‌ కొట్టేసింది రష్మిక. కాంతారా సినిమాతో ఒక్కసారిగా మోస్ట్‌ వాంటెడ్‌ డెరెక్టర్‌గా మారిపోయారు రిషబ్‌ షెట్టి. మరి ఈ ఇద్దరికీ ఎక్కడ చెడింది.! సడెన్‌గా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఎందుకు మారిపోయారు? ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య రాజుకున్న వివాదం అసలు ఎక్కడ మొదలైంది? రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి..ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే. ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్లైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అందుకు కారణం ఆ మధ్య రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌. తను నటి కావాలని అనుకోలేదనీ, తన అందం, నటనా చూసి అవకాశాలు నడిచొచ్చాయని ఓ ఇంటర్వ్యూలో కామెంట్‌ చేసింది రష్మిక.

సో కాల్డ్‌ అంటూ..

మీకెరీర్‌ ఎలా స్టార్టయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో రష్మికను ప్రశ్నిస్తే… కాలేజ్ డేస్ లో నేను మోడలింగ్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఈ సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ నుండి కిరాక్ పార్టీ మూవీ ఆఫర్ వచ్చింది” అంటూ రెండు చేతులతో సైగలు చేస్తూ చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన రిషబ్‌ షెట్టి బ్యానర్‌ పేరు కూడా మెన్షన్‌ చేయకుండా .. చేతులతో సంకేతాన్నిచ్చారు. రష్మికని .. అసలు సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసింది రిషబ్‌ శెట్టి. కిర్రాక్ పార్టీ సినిమాలో…కానీ అతనిగురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో హేళనగా మాట్లాడ్డం ఇప్పడు కన్నడనాట కలకలం రేపుతోంది. అసలు ఎప్పుడో మాట్లాడిన రష్మిక వ్యాఖ్యలు ఇప్పుడు తెరపైకి తెచ్చింది ఇటీవల రిషబ్‌ శెట్టి ఇంటర్వ్యూ ఒకటి. వీరి మధ్య వైరం ముదిరిన విషయాన్ని ఇదే ఇంటర్వ్యూ మరోసారి రుజువు చేసింది.

ఇవి కూడా చదవండి

ఆమెతో మాత్రం చేయను..

రిషబ్‌ శెట్టి హీరోగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంతార కన్నడలోనే కాదు. యావత్‌ దేశంలో బ్లాక్‌ బస్టర్‌ సాధించింది. 400 కోట్లు కలెక్ట్‌ చేసిపెట్టింది. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు ప్రకంపనలు సృష్టించింది. ఇంత సక్సెస్‌ సాధించిన రిషబ్‌ షెట్టి నోటి వెంట ఫ్యూచర్ లో సమంత , సాయిపల్లవి తో సినిమాలు తీస్తాను కానీ రష్మిక తో చేయను అన్న వ్యాఖ్యలు రావడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రచ్చరేపుతోంది. ఇదే ఇటు కాంతారా డైరెక్టర్ రిషబ్ షెట్టి కీ రష్మికకి మధ్య అగ్గిరాజుకోవడానికి కారణమయ్యింది. కాంతార సక్సెస్‌ సందర్భంగా సినిమాలు తీయాల్సి వస్తే..సమంత, సాయిపల్లవి, రష్మికల్లో ఎవరిని ఎంచుకుంటారు అన్న ప్రశ్నకు సమంత, సాయిపల్లవిలకే ప్రథమ స్థానం ఇస్తానన్న రిషబ్‌.,…రష్మిక ని ఉద్దేశించి అచ్చం రష్మిక చూపించిన సంకేతం చూపిస్తూ రష్మికకు అవకాశం ఇవ్వనని తేల్చిచెప్పి… షాకిచ్చారు. దీంతో వీరిద్దరి మధ్యా ముసురుకున్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది.

ఈ విషయాన్నీ పక్కన పెడితే.. కిరాక్ పార్టీ సినిమాలో రష్మిక.. రక్షిత్ శెట్టి సరసన నటించింది. అప్పుడే రక్షిత్ శెట్టితో ప్రేమ..ఎంగేజ్మెంట్ కి దారితీసింది. ఆ తరువాత బ్రేకప్‌ అయ్యిందనుకోండి…ఎంగేజ్మెంట్ అయిన కొద్దిరోజులకే రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సల్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత మళ్లీ రక్షిత్ శెట్టి గురించి, లవ్ బ్రేకప్ గురించి పెద్దగా స్పందించలేదు. కానీ.. తాజాగా ఆమె రిషబ్‌ శెట్టిని ఉద్దేశించిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్గిరాజేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?