AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shantipriya: భానుప్రియ చెల్లెలు ఇప్పుడెలా ఉందో తెలుసా? సెకెండ్ ఇన్నింగ్స్‌ కూడా స్టార్ట్‌ చేసిందండోయ్‌

మహర్షి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది శాంతప్రియ. ఆతర్వాత సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని, శిలా శాసనం, జస్టిస్‌ రుద్రమదేవి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

Shantipriya: భానుప్రియ చెల్లెలు ఇప్పుడెలా ఉందో తెలుసా? సెకెండ్ ఇన్నింగ్స్‌ కూడా స్టార్ట్‌ చేసిందండోయ్‌
Bhanupriya
Basha Shek
|

Updated on: Feb 24, 2023 | 5:06 AM

Share

భానుప్రియ.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అందం, అభినయంతో పాటు కూచిపుడి డ్యాన్సర్‌గా దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి, వదిన లాంటి క్యారెక్టర్‌ పాత్రలు పోషిస్తోంది. ఇదిలా ఉంటే భానుప్రియ చెల్లెలు నిషాంతి అలియాస్‌ శాంతిప్రియ కూడా హీరోయిన్‌గా చేసింది. అయితే కొన్ని సినిమాల్లోనే. అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మహర్షి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది శాంతిప్రియ. ఆతర్వాత సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని, శిలా శాసనం, జస్టిస్‌ రుద్రమదేవి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. హిందీ, తమిళ్‌, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. మధ్యలో కొన్ని సీరియళ్లలో నటించినా వెండితెరపై మాత్రం కనిపించలేదు.

అయితే మూడు దశాబ్దాల తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది శాంతిప్రియ. ఇటీవల ఆమె ధారావి బ్యాంక్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో సునీల్‌ శెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌ వంటి ప్రముఖులు నటించారు. ఈ సిరీస్‌లో సునీల్‌శెట్టి చెల్లెలు పొన్నమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది నిశాంతి. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు, సిరీస్‌లకు ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా 1999లో సినిమా ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ్‌ రేతో ఏడడుగులు నడిచింది నిశాంతి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2004లో శాంతి ప్రియ భర్త కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..