AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS VS ENG: ఇదేం షాట్‌ రా బాబోయ్‌.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కళ్లు చెదిరే సిక్సర్.. నోరెళ్ల బెట్టిన బౌలర్

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌లో భాగంగా మిచెల్‌ మార్ష్‌ ఓ కళ్లు చెదిరే షాట్‌ ఆడి బౌలర్లతో పాటు గ్యాలరీలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఒల్లీ స్టోన్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతిని మార్ష్‌ 115 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. మార్ష్‌ కొట్టిన బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి పడింది.

AUS VS ENG: ఇదేం షాట్‌ రా బాబోయ్‌.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కళ్లు చెదిరే సిక్సర్.. నోరెళ్ల బెట్టిన బౌలర్
Mitchell Marsh
Basha Shek
|

Updated on: Nov 23, 2022 | 10:03 AM

Share

మంగళవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 221 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. మ్యాచ్ వర్షం కారణంగా ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే ఇంగ్లిష్‌ జట్టు 31.4 ఓవర్లలో కేవలం 142 పరుగులకు ఆలౌటైంది.తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆసీస్‌.. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆడిన ఒక షాట్‌ ప్రత్యర్థులతో పాటు మైదానంలోని ప్రేక్షలకులందిరనీ నోరెళ్ల బెట్టేలా చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌లో భాగంగా మిచెల్‌ మార్ష్‌ ఓ కళ్లు చెదిరే షాట్‌ ఆడి మైదానంలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఒల్లీ స్టోన్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతిని మార్ష్‌ 115 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. మార్ష్‌ కొట్టిన బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి పడింది.  ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని  మెల్‌బోర్న్‌ మైదానానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్‌ స్టేడియంగా పేరుంది. ఇక్కడే బంతి స్టాండ్స్‌లోకి వెళ్లిందంటే.. ఇండియాలో అయితే బంతి స్టేడియం దాటేదేమోనని క్రికెట్‌ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీల కారణంగా భారీ స్కోరు సాధించింది. వర్షం కారణంగా కుదించిన 48 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. మార్ష్ 16 బంతులు ఎదుర్కొని 187.50 స్ట్రైక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా. అయితే ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..