SRH: ధోని శిష్యుడూ.. టీమిండియాకు యువ పేస్ బౌలర్.. యార్కర్లతో ప్రత్యర్ధుల ఊచకోతే.. ఎవరో తెలుసా!
షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, వసీమ్ అక్రమ్, స్టార్క్ లాంటి వేగవంతమైన బంతులతో బ్యాటర్లు బెంబేలెత్తించిన బౌలర్లను మీరు చూసి ఉంటారు. ఇతడు కూడా అంతే!
క్రికెట్ ప్రపంచంలో తుఫాన్ బౌలర్లను తయారు చేసిన దేశాల్లో టీమిండియా కూడా ఒకటి. షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, వసీమ్ అక్రమ్, స్టార్క్ లాంటి వేగవంతమైన బంతులతో బ్యాటర్లు బెంబేలెత్తించిన బౌలర్లను మీరు చూసి ఉంటారు. ఇతడు కూడా అంతే! 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే సత్తా ఉన్న బౌలర్.. టీమిండియా ‘స్పీడ్ గన్’.. మరి అతడెవరో కాదు.. ఉమ్రాన్ మాలిక్. నిన్న ఉమ్రాన్ మాలిక్ పుట్టినరోజు.. ప్రస్తుతం అతడు న్యూజిలాండ్ టూర్‌లో టీమిండియాతో ఉన్నాడు. భారత్ తరఫున మూడు టీ20 మ్యాచ్ ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ బౌలర్ నెట్ బౌలర్‌గా IPLలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు.
ఇలా ప్రయాణం మొదలైంది..
1999లో జమ్మూకశ్మీర్‌లో జన్మించిన ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ పండ్ల వ్యాపారి. కుటుంబం పేదరికంలో ఉన్నప్పటికీ.. కొడుకు కోరికను ఏనాడూ కాదనలేదు. అతడికి ప్రోత్సహించి.. క్రికెట్‌లో పూర్తి సహకారం అందించాడు. గల్లీ క్రికెట్‌తో ఉమ్రాన్ మాలిక్ తన కెరీర్ ప్రారంభించాడు. మొదట్లో టెన్నిస్ బాల్‌తో ఆడేవాడు. ఇక ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ మాలిక్‌ను నెట్ బౌలర్‌గా తీసుకుంది. దీంతో అందరి దృష్టి అతడి వైపు మళ్లింది. ఆ తర్వాత ఆ టీంలో ఓ స్టార్ బౌలర్‌గా ఎదిగాడు.
ఐపీఎల్‌లో ‘స్పీడ్ గన్’..
ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో స్వింగ్ తక్కువగా ఉన్నప్పటికీ.. వేగం మాత్రం అమోఘం. 150 కిలోమీటర్ల వేగంతో నిరంతరం బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. IPL 2022లో, ఈ బౌలర్ తన తుఫాను బౌలింగ్‌తో రికార్డులు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఆ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. IPL-2022 టాప్-10 వేగవంతమైన బంతులు చూస్తే, అందులో ఉమ్రాన్ పేరు తొమ్మిదింటిలో ఉంది. భారత భవిష్యత్తు స్టార్ బౌలర్ ఉమ్రాన్ అని చాలామంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..