IPL 2023: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ దొరికేశాడోచ్.. విలియమ్సన్ వారసుడు అతడేనట.?

మినీ వేలానికి ముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పలువురు కీలక ఆటగాళ్లను విడిచిపెట్టింది ఫ్రాంచైజీ. దీంతో రాబోయే సీజన్‌లో..

IPL 2023: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ దొరికేశాడోచ్.. విలియమ్సన్ వారసుడు అతడేనట.?
Sunrisers Hyderabad
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2022 | 8:12 AM

ఐపీఎల్ 2023లో టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది సన్‌రైజర్స్. ఈ క్రమంలోనే మినీ వేలానికి ముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పలువురు కీలక ఆటగాళ్లను విడిచిపెట్టింది ఫ్రాంచైజీ. దీంతో రాబోయే సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు ఎవరు చేపడతారన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మొదటిగా భువనేశ్వర్ కుమార్ పేరు వినిపించగా.. ఆ తర్వాత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సారధిగా వ్యవహరిస్తాడని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు కెప్టెన్సీ రేసులోకి కొత్త పేరు తెరపైకి వచ్చింది.

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్‌రమ్‌ను నియమించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ‘జట్టు కెప్టెన్‌గా ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉంది. అభిమానులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. కెప్టెన్సీ అన్నది పెద్ద బాధ్యత. ప్రస్తుతం మా దృష్టిలో మార్క్‌రమ్‌ ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం లేనప్పటికీ జట్టును నడిపించగల సత్తా ఉంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా మా జట్టుకు కెప్టెన్‌గా మార్క్‌రమ్‌‌నే తీసుకోవాలని అనుకుంటున్నాం. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి జాతీయ మీడియా ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా, దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..