OTT Movies: ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్.. ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్‌బస్టర్ చిత్రాలివే..
ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన మూడు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమయ్యాయి. మరి అవేంటో..
కరోనా వచ్చిన తర్వాత నుంచి ఓటీటీ మార్కెట్ బాగా పుంజుకుంది. కారణాలు ఏవైనా.. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. ఇక వారికి అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా ప్రతీ వారం సరికొత్త వెబ్ సిరీస్‌లు, సూపర్ హిట్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన మూడు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమయ్యాయి. మరి అవేంటో చూసేద్దాం పదండి..
ప్రిన్స్:
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, ‘జాతిరత్నాల’ ఫేం అనుదీప్ కెవి కలయికలో రూపొందిన చిత్రం ‘ప్రిన్స్‘. మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. కామెడీ ఎంటర్టైనర్‌గా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకులను ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడని ఫ్యాన్స్‌కు.. ‘ప్రిన్స్’ నవంబర్ 25వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఆ రోజు నుంచి తమిళం, తెలుగు భాషల్లో ఫ్యాన్స్‌కు అందుబాటులో రానుంది.
కాంతారా:
కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ‘కాంతారా’. ఒక్క భాషలోనే కాదు.. విడుదలైన అన్ని లాంగ్వేజ్‌స్‌లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడమే కాదు.. వసూళ్లు పరంగా ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం నవంబర్ 24, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. పే పర్ వ్యూ లేదా ఉచితంగానా అనేది తెలియాల్సి ఉంది. కాగా, రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాగా.. తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు.
చుప్:
దుల్కర్ సల్మాన్, శ్రియా ధన్వంతరి హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఆర్.బాల్కీ తెరకెక్కించిన చిత్రం ‘చుప్’. తీవ్ర విమర్శలు చేసే ఫిల్మ్ క్రిటిక్స్‌పై ఓ ఆర్టిస్ట్ రివెంజ్ తీర్చుకుంటే ఎట్లా ఉంటుందన్నది ఈ చిత్రం కథాంశం. సన్నీ డియాల్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో దుల్కర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ నెల 25వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో ‘చుప్’ మూవీ స్ట్రీమింగ్ కానుంది.