Childhood Photo: ఏఎన్నార్ సూపర్ హిట్ సినిమాలో నటించిన ఈ బాలనటుడు.. నేడు స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..

కమల్ హాసన్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, తారక్ వరకూ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు.  ఇప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాలనటుడు ఎవరో గుర్తు పట్టారా.. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా.. కానీ గుర్తుపట్టడం కొంచెం కష్టమే.. ఎందుకంటే నేటి స్టార్ హీరో.. చైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక సినిమాలో నటించాడు మరి

Childhood Photo: ఏఎన్నార్ సూపర్ హిట్ సినిమాలో నటించిన ఈ బాలనటుడు.. నేడు స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..
Daggubati Venkatesh
Follow us

|

Updated on: Nov 21, 2022 | 8:23 AM

బాల్యం ఎవరికైనా అపురూపమే.. మరి ఆ అందమైన బాల్యాన్ని గుర్తు తెచ్చే ఫోటోలు మరింత అపురూపం. అయితే చిన్నతనంలో సినిమాల్లో బాలనటులుగా కనిపించి అలరించిన కొంతమంది మరింత అదృష్ట వంతులని చెప్పవచ్చు. బాలనటులుగా వెండి తెరపై అడుగు పెట్టి.. అనేక సినిమాల్లో చిన్నారి నటులుగా నటించి ప్రేక్షకులను మెప్పించి పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరో, హీరోయిన్స్ గా రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు.. మరొకొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా అనుకోకుండా ఒకటి రెండు సినిమాల్లో కనిపించి.. వెండితెరకు పరిచయమై.. కాలక్రమంలో టాలీవుడ్‌లో హీరోలుగా అడుగు పెట్టి.. స్టార్ హీరోల రేంజ్ కు చేరుకున్నారు. తమ నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. కమల్ హాసన్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, తారక్ వరకూ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు.  ఇప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాలనటుడు ఎవరో గుర్తు పట్టారా.. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా.. కానీ గుర్తుపట్టడం కొంచెం కష్టమే.. ఎందుకంటే నేటి స్టార్ హీరో.. చైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక సినిమాలో నటించాడు మరి. స్వర్గీయ ఏఎన్నార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలో బాలనటుడిగా కనిపించారు. హీరోగా అడుగు పెట్టి.. డిఫరెంట్ పాత్రలతో కుటుంబ కథా చిత్రాలతో విక్టరీ హీరోగా ఫేమస్ అయ్యారు.

అతనే ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ప్రేమ నగర్ లో వెంకటేష్ బాల నటుడిగా కనిపించారు.  ఈ సినిమా 1971లో విడుదలైన అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ఏఎన్నార్ అన్న పాత్రలో సత్యనారాయణ నటించారు. కేశవ్ వర్మ సత్యనారాయణ చిన్న నాటి పాత్రలో వెంకటేష్ కనిపించారు.

వెంకటేష్ డిసెంబరు 13న ప్రకాశం జిల్లా కారంచెడులో జన్మించారు. 1986లో కలియుగ పాండవులు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వెంకటేష్ అనేక సూపర్ హిట్ సినిమాలను అందుకుని విక్టరీని తన పేరుగా మార్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..