Superstar Krishna: బతకడంలోనూ.. సూపర్ స్టారే.. ఆస్తులు ఆరేంజ్‌ మరి.. మొత్తం విలువ ఎంతో తెలుసా..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. చాలా తక్కువ టైంలోనే హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్‌ ఆర్ తరువాతి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మూడు షిష్టుల్లో పని చేస్తూ.. వరుస సినిమాలను తన అభిమానుల కోసం రిలీజ్ చేశారు.

Superstar Krishna: బతకడంలోనూ.. సూపర్ స్టారే.. ఆస్తులు ఆరేంజ్‌ మరి.. మొత్తం విలువ ఎంతో తెలుసా..
Super Star Krishna
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 4:47 PM

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌కు జేమ్స్ బాండ్ ఆయనే..! తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కౌబాయ్ ఆయనే! సినిమాకు విప్లవ భావాలు అద్దింది ఆయనే..! అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా.. డైలాగులు చెప్పేది కూడా ఆయనే! అందుకే ఆయననను నటవేఖరుడని అందరూ అంటారు. కాస్త మోడ్రన్‌గా సూపర్ స్టార్ పిలచుకుంటున్నారు. ఇక సినిమాల్లో రాణించాలని.. హీరోగా వెలిగిపోవాలనే కోరికతో.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. చాలా తక్కువ టైంలోనే హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్‌ ఆర్ తరువాతి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మూడు షిష్టుల్లో పని చేస్తూ.. వరుస సినిమాలను తన అభిమానుల కోసం రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు నమోదు చేశారు.

ఇలా సినిమాల కోసమే పరితపించే కృష్ణ.. చాలానే సంపాదించారు. పద్మాలయ స్టూడియోను నిర్మించారు. సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అయితే అప్పట్లో రోజు మూడు షిప్టులు దాదాపు ఏడాదికి 6 సినిమాలకు పైగా నటించినా మనీ మేనేజ్ మెంట్ తెలియక అందరి హీరోల్లా ఆస్తులను భారీగా కూడబెట్టలేదని పలువురు సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే సినిమా సమయంలో పలు నిర్మాతలు ఇచ్చిన చెక్కులు సినిమా ప్లాప్ అయితే.. రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో.. ఆ చెక్కులను తాను ఇప్పటికీ దాచుకున్నట్లు పలు సందర్భాల్లో కృష్ణ దంపతులు పేర్కొన్నారు కూడా.. అయితే సూపర్ స్టార్ కృష్ణ పోగొట్టుకున్న ఆస్తులను కాకుండా తన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టిన ఆస్తుల విలువ సుమారు .. రూ 30కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కృష్ణ తనకెంతో ఇష్టమైన లగ్జీర కార్లను కొన్నారు. వాటిలో ఠీవీగా తిరిగారు. ఇలా కృష్ణ.. నిజంగా సూపర్ స్టార్ జీవితాన్నే గడిపారు.

దాదాపు 300 కోట్లు ఆస్తుపాస్తులను కూడా బెట్టారనే టాక్‌ను వచ్చేలా చేసుకున్నారు. ఇక సినిమాలకు రిటైర్‌మెంట్ ఇచ్చాక.. ప్రశాంతగా.. తన సొంత ఇంట్లో.. తన ఇద్దరు భార్యలతో కలిసి ఉన్నారు. ఇక ఇప్పుడు అనుకోకుండా కార్డియో కరెస్ట్ తో మరణించారు. తన శకం ముగిసిందంటూ.. ఇక తిరిగి రాని లోకాలకు చేరారు మన కృష్ణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..