Kodali Nani: పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కొడాలి నాని.. బాక్సాఫీస్ దుమ్మురేపిన ఆ చిత్రం ఏంటంటే?

జనసేన అధినేతపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు వీలున్నప్పుడల్లా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, కోడలి నాని, కురసాల కన్నబాబు వంటి వారు తరచుగా పవన్ కళ్యాణ్ పై మాటల దాడి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. 

Kodali Nani: పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కొడాలి నాని.. బాక్సాఫీస్ దుమ్మురేపిన ఆ చిత్రం ఏంటంటే?
Kodali Nani Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2022 | 12:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తనదైన శైలిలో సినిమాలను చేస్తూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పేజీని లిఖించుకున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాడు. టాలీవుడ్ ను స్టార్ గా ఏలుతున్నాడు. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు… కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు.. ఆయన్ని దేవుడిగా కొలుస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.  పవన్ కళ్యాణ్ ను అభిమానించే సెలబ్రెటీలు.. ఆరాధించే వ్యక్తులు అనేకమంది ఉన్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జనసేన పార్టీని స్థాపించి ప్రజల క్షేత్రంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకుని వస్తూ తన గళం వినిపిస్తున్నాడు ఈ జనసేనాని.. అయితే అదే సమయంలో  అప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ను హీరోగా అభిమానించిన నేతలు.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన అధినేతపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు వీలున్నప్పుడల్లా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, కోడలి నాని, కురసాల కన్నబాబు వంటి వారు తరచుగా పవన్ కళ్యాణ్ పై మాటల దాడి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారట.. అంతేకాదు కొడాలి నాని రాజకీయాల్లోకి అడుగు పుట్టకముందు మూవీ డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా వ్యవహరించేవారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాను కృష్ణా జిల్లాలో విడుదల చేసారట.. ఈ వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి మూవీ ఎగ్జిబిటర్ గా పనిచేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాని కొనుగోలు చేశారట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయిన జల్సా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ను బీట్ చేసింది. అంతేకాదు ఆ సమయంలో కృష్ణాజిల్లాలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా జల్సా సినిమా సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది. కాలక్రమంలో నిర్మాతగా మారి కొడాలి నాని జూ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!