బ్రహ్మముడి సీరియల్లో అలా.. వెకేషన్‏లో రుద్రాణి అరాచకమే..

Rajitha Chanti

Pic credit - Instagram

10 June 2026

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది రుద్రాణి.

 రుద్రాణి అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది షర్మిత గౌడ. సీరియల్‌లో అత్తగా, పద్దతిగా చీరకట్టులో కనిపించింది.

సోషల్ మీడియాలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన వెకేషన్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

నిజానికి షర్మిత గౌడ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. కానీ, సీరియల్స్‌లో మాత్రం తనకంటే వయసులో పెద్దవారైన నటీనటులకు అత్తగా, తల్లిగా నటిస్తుంది.

వయసుతో సంబంధం లేకుండా పాత్రల పరంగా ఎంతో పరిణితిని కనబరుస్తున్న షర్మిత, కెరీర్ పరంగా వరుస సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షర్మిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె చాలా గ్లామరస్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తోంది.

సీరియల్‌లోని రుద్రాణి పాత్రకు, నిజ జీవితంలో ఉన్న షర్మితకు అసలు సంబంధమే లేదని ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. గ్లామర్ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. 

లేటెస్ట్ గ్లామర్ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "సీరియల్‌లో విలన్‌గా భయపెట్టే రుద్రాణి అత్తా, నిజంగా ఇంత గ్లామరస్‌గా ఉందా?" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.