గ్లామరస్ లుక్స్‌లో జ్యోతిక.. 47 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీగా
Rajitha Chanti
Pic credit - Instagram
10 June 2026
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన నటి జ్యోతిక (Jyotika) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అందాల భామ, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వైవిధ్యమైన పాత్రలతో, వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
తాజాగా జ్యోతికకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కొత్త లుక్ చూసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.
జ్యోతిక ప్రస్తుతం నటిస్తున్న ‘సిస్టమ్’ అనే సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఈవెంట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను జ్యోతిక పంచుకుంది.
అందులో జ్యోతిక ఎంతో ఫిట్‌గా కనిపించింది. "ఈమె నిజంగానే 18 ఏళ్ల కూతురికి తల్లి అంటే నమ్మలేకపోతున్నాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న జ్యోతికకు ఏజ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఈ లుక్ నిరూపిస్తోంది. జ్యోతిక కెరీర్ ప్రారంభం నుండి కాస్త బొద్దుగా కనిపించింది.
‘36 వయతినిలే’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తన లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది. ఇందుకోసం జ్యోతిక జిమ్‌లో ఎంతో కష్టపడి కఠినమైన వర్కౌట్లు చేసింది.
గతంలో ఆమె షేర్ చేసిన వర్కౌట్ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. మొత్తానికి జ్యోతిక ఫిట్‌నెస్ లుక్ ప్రస్తుత అమ్మాయిలకు ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.