AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Leonardo DiCaprio: టైటానిక్ హీరో లియో పుట్టిన రోజు నేడు.. సినిమాను మించి నిజ జీవితంలో ప్రేమాయణంతో వార్తల్లో నిలిచే హీరో..

సినీ జీవితంలో మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా లియోనార్డో డికాప్రియో ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం  మోడల్ జిగి హడిద్‌తో ప్రేమలో మునిగితేలుతున్నారు లియోనార్డో.

Happy Birthday Leonardo DiCaprio: టైటానిక్ హీరో లియో పుట్టిన రోజు నేడు.. సినిమాను మించి నిజ జీవితంలో ప్రేమాయణంతో వార్తల్లో నిలిచే హీరో..
Titanic Fame Leonardo Dicaprio
Surya Kala
|

Updated on: Nov 11, 2022 | 10:41 AM

Share

లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో హాలీవుడ్ నటుడు, నిర్మాత. లియోనార్డో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లియోనార్డో.. హాలీవుడ్ లో మాత్రమే కాదు.. టైటానిక్ సినిమాతో భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచాడు. హాలీవుడ్‌లోని అత్యుత్తమ నటుల్లో లియోనార్డో ఒకరు. బయోపిక్స్, పీరియడ్ చిత్రాల్లో తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈరోజు నటుడు తన 48 వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా.. లియోనార్డో  జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరు లియోనార్డో డికాప్రియో. లాస్ ఏంజిల్స్‌లో జన్మించిన డికాప్రియో 1980 ఏడాది చివరిలో పలు యాడ్స్ లో నటించాడు. అనంతరం పలు టీవీ సీరియల్స్ లో నటించి ఫేమస్ అయ్యాడు. వెండి తెరపై బాయ్స్ లైఫ్ సినిమాతో నటుడిగా అడుగు పెట్టి.. వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్ సినిమాతో నటించిన పాత్రలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. హిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన టైటానిక్ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందాడు.

ఇవి కూడా చదవండి

సినీ జీవితంలో మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా లియోనార్డో డికాప్రియో ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం  మోడల్ జిగి హడిద్‌తో ప్రేమలో మునిగితేలుతున్నారు లియోనార్డో. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఫంక్షన్ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడంతో లియోనార్డో, హడిద్ ల మధ్య ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో ఇద్దరి ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

ఫాక్స్ న్యూస్ ప్రకారం.. కొన్ని నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని కాసా సిప్రియానిలో లియోనార్డో , హడిద్ కలిసి కనిపించారు. ఈ సమయంలో తీసిన చిత్రం కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఈ చిత్రంలో లియోనార్డో.. హదీద్ భుజం చుట్టూ చేతులు వేశాడు.. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.

లియోనార్డో , హడిద్ కూడా చాలాసార్లు జంటగా కనిపిస్తుండడంతో వీరు డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు వైరల్ గా మారాయి.  అయితే కొన్ని నెలల క్రితం.. లియోనార్డో ..  ‘కెమిల్లా మోరోన్’ తమ బంధానికి బ్రేకప్ చెప్పారు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. లియోనార్డో ఎప్పుడూ ప్రేమ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే.. లియోనార్డో.. 25 ఏళ్ళు దాటిన అమ్మాయిలతో ఇప్పటి వరకూ డేటింగ్ చేయలేదు. దీంతో లియో..  25 ఏళ్లు పైబడిన అమ్మాయిలతో డేటింగ్ చేయదంటూ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో  వైరల్ అవుతూ ఉంటాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..