Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna on Pawan: పవనుడిపై అక్కినేనివారబ్బాయి ప్రశంసల వర్షం.. టాలీవుడ్ లో నీ స్థానం ప్రత్యేకం అంటున్న నాగ్..

మరిచెట్టు నీడలో చిన్న చెట్టు ఎదగడం కష్టం .. అదే విధంగా ఓ సూపర్ స్టార్ నీడ నుంచి.. అదే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి వచ్చి తనకంటూ ఓ బయటకు వచ్చి తనకంటూ ఓ నిరూపించుకోవడం సామాన్యమైన విషయం కాదు. తమ టాలెంట్ నిరూపించుకోవడం చాలా అరుదు.‌

Nagarjuna on Pawan: పవనుడిపై అక్కినేనివారబ్బాయి ప్రశంసల వర్షం.. టాలీవుడ్ లో నీ స్థానం ప్రత్యేకం అంటున్న నాగ్..
Nagarjuna Pawan Kalyan
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 20, 2022 | 11:03 AM

టాలీవుడ్ నవ మన్మథుడు.. కింగ్ అక్కినేని నాగార్జున టాలీవుడ్, కోలీవుడ్ లోని ఇద్దరు హీరోలపై ప్రశంసల వర్షం కురిపించాడు. కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్దార్.. తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగులో పవన్ కళ్యాణ్.. తమిళంలో కార్తి.. అంటూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పవన్ కళ్యాణ్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, తమిళంలో కార్తి అరుదైన నటులన్నారు. ఫ్యామిలీ నేపథ్యం వున్న తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

కార్తీతో నాగార్జునకు మంచి రిలేషన్ షిప్ ఉంది. ఊపిరి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించినప్పుడు నాగ్ ను కార్తీ అన్నయ్య అని పిలిచేవాడట.. అప్పటి నుంచి కార్తీని నాగార్జున తమ్ముడిలా చూస్తూనే ఉన్నాడు.. ఈ నేపథ్యంలో కార్తీపై ఆయన ప్రత్యేక అనుబంధాన్ని చూపిస్తాడు. తాజాగా హీరోగా కార్తీ సాధించిన ఘనతను చెబుతూ…. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నాగార్జున పోల్చారు. కార్తీకి పవన్ కళ్యాణ్ కు మధ్య ఉన్న ఒక కామన్ పాయింట్ ను వెల్లడించారు.

”కార్తీ అన్నయ్య సూర్య సూపర్ స్టార్. మరిచెట్టు నీడలో చిన్న చెట్టు ఎదగడం కష్టం .. అదే విధంగా ఓ సూపర్ స్టార్ నీడ నుంచి.. అదే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి వచ్చి తనకంటూ ఓ బయటకు వచ్చి తనకంటూ ఓ నిరూపించుకోవడం సామాన్యమైన విషయం కాదు. తమ టాలెంట్ నిరూపించుకోవడం చాలా అరుదు.‌ అన్న పేరుతో వెలుగులోకి వచ్చినా స్వశక్తితో తనకంటూ ఫేమ్ తెచ్చుకున్న వారు ఇద్దరున్నారు.

ఇవి కూడా చదవండి

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. అటు కన్నడలో శివ రాజ్ కుమార్ తమ్ముడి గుర్తింపు నుంచి అప్పుగా తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమారు. వీరిలా కార్తీ..  సూర్య తమ్ముడు కార్తీ నుంచి సొంతం ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడని నాగార్జున చెప్పాడు. ప్రస్తుతం తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించడం వారికీ మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆ వీడియో వైరల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..