AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaya Bachchan: మరోసారి మీడియా కెమరామెన్లపై చిందులు తొక్కిన జయా బచ్చన్.. ఆమెకు ప్రాధాన్యత ఇవ్వొద్దంటున్న నెటిజన్లు..

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసారు. జయా బచ్చన్ స్నాప్స్  క్లిక్ చేస్తున్నప్పుడు తడబడ్డారు. అంతేకాదు ఆమె ఎప్పుడు దేనిపై కోపంగా ఉంటుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.

Jaya Bachchan: మరోసారి మీడియా కెమరామెన్లపై చిందులు తొక్కిన జయా బచ్చన్.. ఆమెకు ప్రాధాన్యత ఇవ్వొద్దంటున్న నెటిజన్లు..
Jaya Bachchan Loses Cool
Surya Kala
|

Updated on: Oct 17, 2022 | 11:54 AM

Share

ప్రముఖ నటి జయ బచ్చన్ తన దుసురు ప్రవర్తనతో పదే పదే వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ముంబైలో తన మనవరాలు నవ్య నవేలి నందాతో కలిసి జయ బచ్చన్ ఓ ఫ్యాషన్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇక్కడ మీడియా ప్రతినిధుల పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించారు.  నవ్యతో పాటు వేదిక వద్ద జయ బచ్చన్ నడుచుకుంటూ వెళుతుండగా.. వారి చిత్రాలను క్లిక్ చేస్తుండగా ఒక మీడియా ప్రాతినిధి  జారిపడ్డాడు. అది చూసిన జయా బచ్చన్, ‘మీకు ఇదే సరైనది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు “మీరు రెట్టింపుగా పడిపోతారని తాను ఆశిస్తున్నాను” అని కోపంతో వ్యాఖ్యానించారు. అదే సమయంలో జయా పక్కడ నడుస్తున్న నవ్య తన అమ్మమ్మని శాంతింపజేయడానికి ప్రయత్నించింది. అప్పుడు జయా మీడియాను ప్రశ్నించారు. “ఆప్ లోగ్ కౌన్ హై? (నీవెవరు)?” మీరు ఏ మీడియా సంస్థకు చెందిన వారని  ప్రశ్నించారు. ఓ వైపు నవ్య తన కోపంగా ఉన్న తన అమ్మమ్మని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తునే ఉంది.. మరోవైపు జయా ఫోటోగ్రాఫర్‌లను ప్రశ్నిస్తూనే ఉన్నది. వారు మీడియా కు చెందిన ఫోటోగ్రాఫర్ల బృందాలకు చెందినవారని సమాధానం చెప్పారు. అప్పుడు జయా మీరు ఏ వార్తాపత్రిక అంటూ ఈవెంట్ వైపుకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసారు. జయా బచ్చన్ స్నాప్స్  క్లిక్ చేస్తున్నప్పుడు తడబడ్డారు. అంతేకాదు ఆమె ఎప్పుడు దేనిపై కోపంగా ఉంటుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మరొకరు ఇలా వ్రాశారు, “ఆమెకు మీడియా ఇంత ప్రాధాన్యత ఇవ్వకూడదు.” అన్నారు. “జయా బచ్చన్ వంటి బాలీవుడ్ భామలు సాధారణ వ్యక్తుల గురించి ఇలాగే ఆలోచిస్తారు. ప్రజలు మరింత బలంగా పడి గాయపడాలని కనీసం జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా కోరుకోడంటూ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

జయా మీడియాపై చిందులు..

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

ఇటీవల, నవ్య నంద తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయ బచ్చన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ చిత్రంలో వారు సంతోషంగా కెమెరాకు పోజులిచ్చారు. నవ్య నంద శ్వేతా బచ్చన్ , నిఖిల్ నందాల కుమార్తె.. అగస్త్య నందా ఈ దంపతుల కుమారుడు.  అగస్త్య నందా జోయా అక్తర్  తెరకెక్కించిన  ‘ది ఆర్చీస్’తో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ , గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ కూడా నటించారు.

అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు సందర్భంగా, జయా బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్స్‌లో మెగాస్టార్‌ను సందర్శించి ఆశ్చర్యపరిచారు. జయ బచ్చన్ ప్రస్తుతం కరణ్ జోహార్  ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో లో నటిస్తున్నారు.  ఆలియా భట్ , రణవీర్ సింగ్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..