Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: త్వరలో సినీపరిశ్రమలో మోగనున్న పెళ్లి బాజాలు.. రాయల్ వెడ్డింగ్ కు సిద్దమవుతున్న హన్సిక

హన్సిక మోత్వాని పెళ్లికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఇప్పటికే ఆమె తన పెళ్లి వేడుకకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో హన్సిక వివాహాన్ని నిర్వహించేందుకు ప్యాలెస్‌లో గదులు సిద్ధం చేస్తున్నామని,

Hansika Motwani: త్వరలో సినీపరిశ్రమలో మోగనున్న పెళ్లి బాజాలు.. రాయల్ వెడ్డింగ్ కు సిద్దమవుతున్న హన్సిక
Hansika
Follow us
Surya Kala

|

Updated on: Oct 17, 2022 | 11:20 AM

బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హీరోయిన్ హన్సిక మోత్వాని. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ సోగ కళ్ల సుందరి. త్వరలో హన్సిక పెళ్లి చేసుకోనున్నదనే టాక్ వినిపిస్తోంది. టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వాని పెళ్లికి సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మేరకు రాయల్ వెడ్డింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. 450 ఏళ్ల నాటి కోట, ప్యాలెస్ వేదికగా హన్సిక వివాహ వేడుక పాతకాలపు టచ్‌తో రాయల్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

హన్సిక మోత్వాని రాయల్ వెడ్డింగ్: 

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌లో హన్సిక మోత్వాని పెళ్లి జరగనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే హన్సిక పెళ్లి చేసుకోనున్నదని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ  ఏడాది చివరిలో పెళ్లికి సిద్ధంగా ఉందని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో హన్సిక పెళ్లి జరగనుంది. విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ హన్సికకు ఆమెకు కాబోయే భర్తకు జీవితకాల జ్ఞాపకాలను అందిస్తుందని భావిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

హన్సిక మోత్వాని పెళ్లికి సన్నాహాలు:

హన్సిక మోత్వాని పెళ్లికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఇప్పటికే ఆమె తన పెళ్లి వేడుకకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో హన్సిక వివాహాన్ని నిర్వహించేందుకు ప్యాలెస్‌లో గదులు సిద్ధం చేస్తున్నామని, పనులు జరుగుతున్నాయని ప్యాలెస్‌కి చెందిన కొందరు సిబ్బంది వెల్లడించారు. సాంస్కృతిక సంపన్నమైన నగరానికి అతిథుల రాకకు ముందుగానే ఏర్పాట్లు చేయనున్నారు. జైపూర్‌లోని ముండోటా కోటలోని ప్యాలెస్ వేదికగా హన్సిక తన కలల వ్యక్తిని వివాహం చేసుకోనుంది.

హన్సిక మోత్వాని నటనా జీవితం వివరాల్లోకి వెళ్తే.. హన్సిక మోత్వాని బాలనటిగా కెరీర్ ను ప్రారంభించింది. షక లక బూమ్ బూమ్, క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ, సోన్ పరీ వంటి టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి అలరించింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హిట్ చిత్రం కోయి మిల్ గయాలో కూడా హన్సిక బాలనటిగా నటించింది.

బాలీవుడ్‌లో, ఆమె ఆప్ కా సురూర్, మనీ హై తో హనీ హై వంటి చిత్రాలను చేసింది. తెలుగులో అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆమె 50వ సినిమా ప్రాజెక్ట్ మహా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. తమిళ చిత్రం రౌడీ బేబీలో రిలీజ్ సిద్ధం కానుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..