AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: మరో ప్రయోగానికి సిద్ధమైన నాని.. కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్న న్యాచురల్‌ స్టార్‌..

శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికి వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌లను ఖాతాలో వేసుకున్న నాని జోష్‌ మీదున్నారు. ప్రస్తుతం ఈ న్యాచురల్‌ స్టార్‌ దసరా సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే...

Nani: మరో ప్రయోగానికి సిద్ధమైన నాని.. కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్న న్యాచురల్‌ స్టార్‌..
Nani New Movie
Narender Vaitla
|

Updated on: Oct 17, 2022 | 7:10 AM

Share

శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికి వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌లను ఖాతాలో వేసుకున్న నాని జోష్‌ మీదున్నారు. ప్రస్తుతం ఈ న్యాచురల్‌ స్టార్‌ దసరా సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల్వక ముందే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాని ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నాడని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ నడుస్తోంది.

దసరా చిత్రంతో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని, ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని లాంచ్‌ చేయనున్నాడని సమాచారం. మోహన్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నాని వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని, నాని కెరీర్‌లో మునుపెన్నడూ రాని డిఫ్రెంట్‌ స్టోరీ లైనప్‌తో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం దసరా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా తదనంతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం