Tollywood: సినీ ప్రియులకు డబుల్ బొనాంజా.. ఈ వారం రిలీజయ్యే ఓటీటీ/థియేటర్ సినిమాలివే..
దివాళీకి ఫ్యాన్స్‌కు డబుల్ బొనంజా ఇచ్చేందుకు అటు ఓటీటీ.. ఇటు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు పలు చిత్రాలు సిద్దమయ్యాయి.
దసరా పండుగకు సీనియర్ హీరోల క్లాష్ చూశాం.. ఇప్పుడు దీపావళికి యువ హీరోలు బాక్స్‌ఆఫీస్ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ దివాళీకి ఫ్యాన్స్‌కు డబుల్ బొనంజా ఇచ్చేందుకు అటు ఓటీటీ.. ఇటు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు పలు చిత్రాలు సిద్దమయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రాలు ఏంటో ఓసారి చూసేద్దాం..!
-
జిన్నా:
మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈషాన్ సూర్య దర్శకుడు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ.. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
-
ఓరి దేవుడా:
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఇది తమిళ హిట్ మూవీ ‘ఓ మై కడువలె’కి తెలుగు రీమేక్. ఇందులో సీనియర్ నటుడు వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. పీవీపీ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన విడుదలవుతోంది.
-
సర్దార్:
అటు తమిళం.. ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో కార్తి.. ‘సర్దార్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పి.ఎస్.మిత్రన్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కాబోతోంది.
-
ప్రిన్స్:
శివకార్తికేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేం దర్శకుడు కెవి అనుదీప్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రిన్స్’. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండియన్ అబ్బాయి, బ్రిటిష్ అమ్మాయి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.
-
ఓటీటీ చిత్రాల లిస్టు ఇదే..
ఇవి ఇలా ఉంటే.. దీపావళికి ఓటీటీలో బ్లాక్‌బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ నెల 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘అమ్ము’ విడుదల కానుండగా.. సోనిలివ్‌లో అక్టోబర్ 20 నుంచి ‘ఒకే ఒక జీవితం’ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కళ్యాణ్ రామ్ హిట్ చిత్రం ‘బింబిసార’ అక్టోబర్ 21 నుంచి జీ5 ఓటీటీలో.. నాగశౌర్య, షర్లీ శెట్టి నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ అక్టోబర్ 23వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..