శ్రీదేవితో జాన్వీకపూర్‌కి పోలిక ఉందా? మీడియా కథనాలపై బోనీకపూర్ రియాక్షన్‌ ఇదే..

అక్టోబర్ 15న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మిలీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఐతే మిలీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తండ్రీకూతుళ్లు..

శ్రీదేవితో జాన్వీకపూర్‌కి పోలిక ఉందా? మీడియా కథనాలపై బోనీకపూర్ రియాక్షన్‌ ఇదే..
BoneyKapoor comments on Janhvi Mili movie
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2022 | 12:37 PM

దివంగత స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో రానిస్తోంది. జాన్వీ తాజా మువీ మిలీ త్వరలో ప్రక్షకుల ముందుకురానుంది. కాగా అక్టోబర్ 15న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మిలీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీతోపాటు సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో విడుదలైన మలయాళ మువీ ‘హెలెన్’కి హిందీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. మలయాళ హెలెన్‌కి దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ హిందీ రీమేక్‌కు కూడా డైరెక్షన్‌ వహించడం విశేషం. ఐతే మిలీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తండ్రీకూతుళ్లు మీడియాతో ముచ్చటించారు. ఓ మీడియా విలేకరి జాన్వీ కపూర్‌ను శ్రీదేవితో పోల్చడాన్ని గమనించిన బోనీ కపూర్ వెంటనే అడ్డుకున్నాడు. నా బిడ్డను ఆమె తల్లి శ్రీదేవితో పోల్చవద్దంటూ సూచించాడు. బోనీ కపూర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ..

‘ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన పంథాను అనుసరిస్తుంటారు. అటువంటి వారిలో శ్రీదేవి ఒకరు. జాన్వీ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటోంది. దక్షిణాదిలో శ్రీదేవి దాదాపు 150ల నుంచి 200 సినిమాలలో పనిచేశారు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకులకు శ్రీదేవి దగ్గరైంది. బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి.. తన నటనా జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. నా బేబీ (జాన్వీ) ఇప్పుడిప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. జాన్వీని తన తల్లితో పోల్చవద్దు. ఆమె కూడా ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తోంద’ని అన్నారు.

ఇవి కూడా చదవండి

మిలీ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత, అందులో జాన్వీ నటనను అభిమానులతోపాటు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసిస్తున్నారు. జాన్వీ కపూర్ మిలీతో పాటు స్టార్ కిడ్ రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్‌లో కూడా నటిస్తోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?