- Telugu News Entertainment Bollywood Alia bhatt neha dhupia natasa stankovic and more celebrities got pregnant before wedding
Bollywood: పెళ్ళికి ముందే గర్భం దాల్చి నటీమణులు.. సారిక, అలియా నుంచి బాలీవుడ్ సెలబ్రెటీలు..
కాలంతో పాటు సంప్రదాయం విలువల్లో కూడా మార్పులు చోటూ చేసుకున్నాయి. పెళ్లి కాకుండా గర్భం దాల్చడం సమాజంలో నేటికీ తప్పుగా పరిగణిస్తున్నారు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం సర్వసాధారంగా తీసుకుంటున్నారు.ఇండస్ట్రీలో ఆలియాతో పాటు పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో నేహా ధూపియా, శృతి హాసన్ తల్లి సారిక, హార్దిక్ పాండ్యా భార్య నటాషా కూడా ఉన్నారు.
Updated on: Nov 07, 2022 | 8:48 PM

అలియా భట్ 6 నవంబర్ 2022 న ఒక అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 14న పెళ్లయిన రెండు నెలల తర్వాత అలియా జూన్ 27న తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

నీనా గుప్తా చాలా ప్రసిద్ధ బాలీవుడ్ నటి. ఆమె ఇప్పటికీ పరిశ్రమలో చాలా చురుకుగా ఉంటుంది. ఆమెకు మసాబా గుప్తా అనే కుమార్తె జన్మించింది. మసాబా.. నీనా గుప్తాకు వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ లకు జన్మించింది.నీనా తన కుమార్తెను తండ్రి లేని లోటును తెలియకుండా ఒంటరిగా పెంచి.. పెళ్లి చేసింది.

కమల్ హాసన్ రెండో భార్య సారిక. కమల్ తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వకముందే సారికతో సహజీవనం చేశారు. దీంతో సారిక పెళ్ళికి ముందే గర్భవతి అయిందని మీడియాలో వార్తలు అప్పట్లో వినిపించారు. కమల్, సారిక లు సహజీవనం చేస్తున్న సమయంలోనే మొదటి కూతురు శృతి హాసన్ పుట్టింది.

నటాషా స్టాంకోవిచ్ భారత ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకుంది. నటాషా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చినట్లు నటాషా, హార్దిక్ పాండ్యా కలిసి ప్రకటించారు.

నేహా ధూపియా, అంగద్ బేడీలు కూడా ఆకస్మిక వివాహం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. మే 2018 లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఒక నెల తరువాత.. తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా నేహా ధూపియా ప్రకటించింది.




