అందాల చిన్నది కాంతార నటి సప్తమి గౌడ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
కాంతారా నటి
ఈ కన్నడ బ్యూటీ 2020 పాప్‌కార్న్ మంకీ టైగర్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
సప్తమి గౌడ
జూన్ 8 1996లో కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొంది, స్విమ్మింగ్ పోటీల్లో అనేక పట్టాలు సంపాదించుకుంది.
కర్జాటకలో జన్మించిన బ్యూటీ
ఇక నటనపై ఉన్న ఆసక్తితో ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ
ముఖ్యంగా స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా మూవీలో అవకాశాన్ని అందుకొని, బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు సంపాదించుకుంది.
కాంతారా మూవీ
ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కన్నడలోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది వరసగా సినిమాలు చేస్తుంది.
క్రేజ్
ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో నితిన్ సరసన తమ్ముడు మూవీలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ అందుకోకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదు.
తమ్ముడు మూవీ
తాజాగా బీచ్‌లో సరదాగా గడిపిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.