AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

God Photos Direction: ఇంట్లో దేవుళ్ల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం ఫోటోలను తప్పు దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందట. కుబేరుడు, హనుమంతుడు సహా ఏ దేవుడి ఫోటోను ఏ దిశలో ఉంచాలో తెలుసుకుని, ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోండి.

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!
God Photos Direction
Rajashekher G
|

Updated on: Jun 10, 2026 | 11:12 PM

Share

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి చిత్రపటం, ప్రతి దిశ ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా దేవతల విగ్రహాలు, ఫోటోలు సరైన దిశలో లేకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి, ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజా మందిరం లేదా దైవ గృహం అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడి నుంచి వెలువడే సానుకూల శక్తి కుటుంబ సభ్యుల మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అందుకే దేవతలను క్రమం తప్పకుండా పూజించడమే కాకుండా, దేవీదేవతల విగ్రహాలు లేదా ఫోటోలను సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తారు.

తప్పు దిశలో దేవుళ్ల ఫోటోలు పెడితే ఏమవుతుంది?

చాలామంది అందంగా కనిపిస్తుందని లేదా ఖాళీ గోడ ఉందని దేవుళ్ల ఫోటోలను ఏ గోడపైనైనా అమర్చేస్తారు. అయితే వాస్తు ప్రకారం ఇది శుభప్రదం కాదు. దేవతల ఫోటోలు అనుచిత దిశలో ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందని చెబుతారు.

దీని వల్ల:

ఇవి కూడా చదవండి
  • కుటుంబ సభ్యుల మధ్య తరచూ వాదనలు రావచ్చు.
  • భార్యాభర్తల మధ్య సామరస్యం తగ్గవచ్చు.
  • పిల్లల్లో చిరాకు, అసహనం పెరగవచ్చు.
  • వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురుకావచ్చు.
  • ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం పెరగవచ్చు.
  • అందుకే దేవతల ఫోటోలను వాస్తు సూచించిన దిశల్లోనే ఉంచాలని సూచిస్తారు.

దేవుళ్ల ఫోటోలకు సరైన దిశ ఏది?

వాస్తు శాస్త్రం ప్రకారం, దేవతల ఫోటోలను ఉంచే దిశ ఆ దేవత స్వరూపాన్ని బట్టి మారుతుంది.

తూర్పు దిశ

సాధారణంగా అన్ని దేవతల ఫోటోలను తూర్పు దిశ వైపు ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని నమ్మకం.

కుబేరుడి ఫోటో

సంపదకు అధిపతిగా భావించే కుబేరుడి ఫోటోను ఉత్తర దిశలోని గోడపై ఉంచడం ఉత్తమం. ఉత్తర దిశ కుబేరునికి అనుకూలమైన దిశగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ధనసంపద, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

దక్షిణ దిశ

సాధారణంగా ఏ దేవుడి ఫోటోనైనా దక్షిణ దిశలో ఉంచకూడదని వాస్తు సూచిస్తుంది. ఇలా చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి, కలహాలు, ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నమ్ముతారు.

హనుమంతుడి ఫోటోకు మినహాయింపు

దక్షిణ దిశలో ఉంచడానికి అనుకూలమైన ఏకైక దేవత హనుమంతుడు. వాస్తు ప్రకారం హనుమంతుడి ఫోటోను దక్షిణ దిశలో ఉంచితే ఇంటిపై చెడు శక్తుల ప్రభావం తగ్గి, రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు.

గుర్తుంచుకోవాల్సిన విషయం

వాస్తు శాస్త్రం అనేది సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడిన విధానం. కాబట్టి దేవతల ఫోటోలను ఉంచేటప్పుడు శుభ్రత, భక్తి, సరైన దిశలను పాటించడం ద్వారా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం, సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us